supply of drinking water
-
హైదరాబాద్‌లో 1, 2 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి,హైదరాబాద్: సింగూరు ఫేజ్– 3 పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి ప్రకటించింది. బుధవారం (జూన్ 1) ఉదయం 6 గంటల నుంచి గురువారం (జూన్2) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్‌కు నీటి లీకేజీలు నివారించేందుకు శంకర్పల్లి సమీపంలో మూడు చోట్ల మరమ్మతు పనులను చేపట్టనున్నారు. దీంతో గండిపేట, నార్సింగి, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ, చందానగర్, హుడా కాలనీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, తారానగర్, గంగారం, లింగంపల్లి రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, గోపన్‌పల్లి, గుల్మొహర్ పార్కు, నేతాజీనగర్, నెహ్రూ నగర్, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, చింతలబస్తీ, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. (క్లిక్: సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..) -
రంగు పడుద్ది
ఇంటి గుమ్మానికి ఎరుపు రంగు గుర్తు.. డేంజర్ అనడానికి సిగ్నల్లాగ.. ఎదురింటికి ఆరెంజ్ గుర్తు.. ఆ పక్క ఇంటికి గ్రీన్.. ఇంకో ఇంటికి బ్లూ.. అంతేకాదు.. మనం మారితే.. ఆ రంగు కూడా మారుతుందట! ప్రస్తుతం ఖైరతాబాద్‌లోనే.. రేప్పొద్దున్న సిటీ అంతా ఈ రంగులు వస్తాయట.. ఈ కలర్ కోడ్ మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట.. ఇంతకీ ఈ రంగుల వెనకున్న కథ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి, బల్దియా ఆధ్వర్యంలో మహోద్యమంగా చేపడుతోన్న జలనాయకత్వం.. జలసంరక్షణ (వాక్) ఉద్యమంలో భాగంగా సిటీలో ఇంటింటికీ రంగుల గుర్తులను వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. ఇంట్లో జరుగుతున్న నీటి వృథా లేదా సంరక్షణను బట్టి రంగులను వేస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్లోని మాతానగర్ బస్తీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నీటివృథా, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంటి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో నీటి వృథా తగ్గితే.. ఇంటికి వేసే రంగు గుర్తు మారుస్తారు. ఈ వినూత్న విధానంపై కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే విలువైన తాగునీటిని సంరక్షించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కేస్తారు.. జలమండలి పరిధిలో ప్రతీ కాలనీ, బస్తీలకు తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లకున్న వాల్‌్వను తిప్పినపుడు ఆ నీరు ఎన్ని ఇళ్లకు..ఏ మోతాదులో సరఫరా అవుతోంది...సరఫరా జరిగిన నీటికి సంబంధించి శాస్త్రీయంగా బిల్లింగ్ జరుగుతుందా అన్న విషయాలను సైతం లెక్కేస్తారు. దీని వల్ల ఆ వీధిలో ఏ ఇంట్లోనైనా నీటి వృథా అధికంగా ఉందా? లేదా అన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోనున్నారు. నగరంలో నిత్యం వృథా అవుతోన్న 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటితో చెన్నై మహానగరం నీటి కొరతను తీర్చవచ్చు. అందుకే ప్రస్తుతం 40 శాతం మేర ఉన్న నీటి వృథాను 20 శాతానికి తగ్గించేందుకు జలసంరక్షణ.. జలనాయకత్వం ఉద్యమాన్ని చేపట్టాము. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటు బల్దియా, జలమండలికి సంబంధించి అన్ని స్థాయిల అధికారులు పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఈనెల 19న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాము. - ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎరుపు - జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీటి వృథా అత్యధికంగా ఉన్నట్లు లెక్క. - వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత లేకపోవడం, నల్లా నీళ్లతో ఫ్లోర్ క్లీనింగ్, జంతువులు, కార్లు, ద్విచక్రవాహనాలను కడగడం వంటివి చేస్తే... - పైపులు, మోటార్లు, వాల్‌్వలు, మీటర్ చాంబర్లలో నీటి వృథా అధికంగా ఉండడం, మీ ఇంట్లోని సంప్ నిండి.. వీధిలోకి నీళ్లు వృథాగా పొంగి పొర్లడం - మీ సంప్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటిని మళ్లించే పైపులైన్లలో లీకేజీ ఉండడం వంటివి.. కాషాయం పైన చెప్పిన విధంగా తొమ్మిది రకాల వృథా కాకుండా.. అందులో ఏ ఐదు రకాల వృథా జరిగినా ఈ గుర్తు పడుతుంది.. పచ్చ మీ ఇంట్లో నీటి వృథాను అరికట్టేందుకు పైన పేర్కొన్న అంశాలను తక్కువ సమయంలో కట్టడి చేయడంతోపాటు ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే.. ఈ రంగు వేస్తారు. నీలం నీటి వృథా అస్సలు లేదు.. పైగా.. మీ ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంత ఉంటే.. ఇంటికి నీటి బిందువును ప్రతిబింబించేలా నీలం గుర్తు వేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
బడ్జెట్‌పై మోదం.. ఖేదం
2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రబడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు అన్ని రంగాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌తో ఏ రంగాలు ఉత్తేజ పడతాయో, ఏవి డీలా పడతాయో చూద్దాం.. సానుకూల ప్రభావం గ్రామీణ భారతం: గ్రామాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణ వ్యయాలను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని గృహాల నిర్మాణం, పశుదాణా ఉత్పత్తి చేసే చిన్న వ్యాపారులకు మద్దతు లాంటి చర్యలు గ్రామీణ భారతంతో సంబంధమున్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రకటించిన చర్యలతో ఎఫ్ఎంసీజీ రంగం ఉత్తేజం పొందనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు: పీఎస్‌యూ బ్యాంకులకు బడ్జెట్లో రూ.70వేల కోట్ల రీక్యాప్ సాయం ప్రకటించారు. దీంతో పాటు షాడో బ్యాంకుల రుణ డిఫాల్టులపై పాక్షిక వన్‌టైమ్ గ్యారెంటీ కల్పన కూడా పీఎస్బీలకు మేలు చేయనుంది. డిఫాల్టయ్యే అవకాశమున్న ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ నియంత్రణా పరిధిలోకి తీసుకురావడం ద్వారా బ్యాంకులను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఎస్బీఐ, బీఓబీ, కెనరాబ్యాంక్, యూబీఐ, బీఓఐ, పీఎన్బీ తదితరాలకు ప్రయోజనం దక్కనుంది. జలవనరులు: 2024 నాటికి దేశంలో అన్ని గృహాలకు తాగునీటి సరఫరా లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న నీటికొరత నివారణపై దృష్టి సారించాలని నిర్ణయించింది. దీంతో వాటర్‌పైప్, ఇరిగేషన్ తదితర జల సంబంధిత రంగాలకు ప్రయోజనం కలగనుంది. విమానయానం: ఏవియేషన్ రంగంలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాను విక్రయించేందుకు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల లీజు, ఫైనాన్సింగ్ విభాగాల్లోకి ప్రవేశించేందుకు కొత్త ప్రణాళికలను ప్రకటించింది. అద్దెదారులు: పట్టణాల్లో నానాటికీ పెరిగిపోతున్న జనాభాలో అధికభాగం అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఇలాంటివారికి ప్రయోజనం కలిగేలా ఒక నమూనా అద్దె చట్టం తీసుకువస్తామని ప్రభుత్వం బడ్జెట్లో హామీ ఇచ్చింది. రియల్టీ, నిర్మాణం: వచ్చే మూడేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు కనెక్టివిటీ పెంచేందుకు రహదారులు, ఇతర రకాల రోడ్ల నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ పెడతామని తెలిపింది. ఈ ప్రకటన మౌలిక వసతులు, నిర్మాణం, సిమెంట్ రంగాలకు ఉత్తేజాన్నిస్తుంది. ప్రతికూల ప్రభావం ఆభరణాలు, బంగారం దిగుమతిదారులు: పసిడిపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో బంగారం, ఆభరణ రంగాలకు చెందిన కంపెనీలు డీలాపడ్డాయి. సుంకం పెంపుతో నగలు, బంగారం మరింత ప్రియం అవుతాయి. పసిడిపై పన్నులు తగ్గిస్తారని ప్రపంచ పసిడి సమాఖ్య అంచనా వేసినా, చివరకు ప్రభుత్వం సుంకాల పెంపునకే మొగ్గు చూపింది. రక్షణ: రక్షణ రంగానికి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన 3.05 లక్షల కోట్ల రూపాయలనే కొత్త బడ్జెట్లో ఖరారు చేశారు. అదనపు కేటాయింపులు లేవు. ఈ మొత్తం గతేడాది కన్నా ఎక్కువే ఐనా పెరిగిన ధరలతో పోలిస్తే ఏమంత పెద్ద మొత్తం కాదని నిపుణులు భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే మిలటరీ సామగ్రిపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడం ఒక్కటే ఈ రంగానికి ఊరటనిచ్చే అంశం. మధ్యతరగతి: పెట్రో ఉత్పత్తులపై అదనపు సెస్సుతో మధ్యతరగతి వర్గంపై భారం పెరగనుంది. ఆటో విడిభాగాలు: విద్యుత్ వాహానాల దిశగా సమాజాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. అయితే ఈ క్రమంలో ఆటో విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఆటో రంగానికి రుచించని అంశం. పర్యావరణం: జలరవాణాను ప్రోత్సహిస్తూ ఇందుకోసం నదులను ఎక్కువగా వినియోగిం చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ చర్యలు పర్యావరణ సమస్యలు తీసుకువస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికాదాయ వర్గాలు: ఏడాదికి రూ. 2 కోట్ల కన్నా ఎక్కువ ఆర్జించే వ్యక్తులపై బడ్జెట్లో పన్ను పెంచారు, సంవత్సరానికి కోటి రూపాయలకు మించి బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే 2 శాతం లెవీ విధించనున్నారు. -
తాగునీటి కోసం ఆందోళన
సర్పంచ్ ఇంటి ఎదుట మహిళల నిరసన రెండు నెలలుగా నీరు సరఫరా కాకపోవడంతో ఆగ్రహం వర్ధన్నపేట : రెండు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన మíßహిళలు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు. మండలంలోని ఇల్లంద ఎస్సీ కాలనీలో కొన్ని కుటుంబాలకు రెండు నెలలుగా నీటి సరఫరా కావడం లేదు. వేసవి రావడంతో సమస్య జఠిలం కాగా, ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో సర్పంచ్ రాయపురం కుమారస్వామి ఇంటికి చేరుకున్నారు. తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్ కాలనీకి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.