support offer
-
53000 శిఖరంపై సెన్సెక్స్
ముంబై: చివరి అరగంటలో మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంతో తొలిసారి 53వేల పైన 53,055 వద్ద స్థిరపడింది. ఈ స్థాయి సెన్సెక్స్‌కు సరికొత్త రికార్డు ముగింపు. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 15880 వద్ద నిలిచింది. అయితే రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు సూచీల లాభాలను పరిమితం చేశాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. భారత తయారీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మెటల్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ముందస్తు ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో రియల్టీ షేర్లు రాణించాయి. మరోవైపు ఆటో, మీడియా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ రెండు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా షేర్లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఉదయం సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 52,920 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల స్వల్ప లాభంతో 15,820 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఆఖర్లో అనూహ్య కొనుగోళ్లతో సెన్సెక్స్ 244 పాయింట్లు ర్యాలీ చేసి 53,105 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 15,894 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.533 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.232 కోట్ల షేర్లను అమ్మారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఏడు పైసలు బలహీనపడి 74.62 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ (బుధవారం రాత్రి) వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలైన బాండ్లు, డాలర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ‘‘మిడ్‌సెషన్ తర్వాత మెటల్ షేర్లు రాణించడంతో మార్కెట్ బౌన్స్‌బ్యాక్ అయ్యింది. దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో రానున్న రోజుల్లో సూచీల గమనానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకం కానున్నాయి. మార్కెట్ పతనమైతే జాగ్రత్త వహిస్తూ కొనుగోళ్లు చేయడం మంచిందే’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. పరుగులు పెట్టిన పేపర్ షేర్లు... కొన్నిరోజుల నుంచి స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్న పేపర్, పేపర్ ఉత్పత్తుల షేర్లు ఇంట్రాడేలో పరుగులు పెట్టాయి. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పేపర్, పేపర్ ఉత్పత్తుల డిమాండ్ 11–15% వృద్ధి చెందుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. చైనాలో కలప ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ కలప కంపెనీలకు కలిసొస్తుందని నిపుణులు తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్ షేర్లు రాణించాయి. ► తొలి క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్ సంస్థ శోభ లిమిటెడ్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది. ► క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్ షేర్లు రాణించాయి. ► తొలి క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్ సంస్థ శోభ లిమిటెడ్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది. ► క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది. -
రైతుల నిరసన.. మద్దతు తెలిపిన ‘ఖలీ’
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం రైతులతో చర్చలు జరుపుతున్నప్పటికి పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్రం బేషరతుగా నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు రైతులుకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రానా అకా ది గ్రేట్ ఖలీ చేరారు. రైతులకు మద్దతిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటన చేశారు దలీప్ సింగ్. అలానే దేశవ్యాప్తంగా ప్రజలను రైతులకు మద్దతివ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు ఖలీ. ‘వారు(రైతులు) రెండు రూపాయలకు అమ్ముకుని.. 200 వందల రూపాయలకు కొనుక్కుంటారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల రోజు కూలీలు, రోడు పక్క వ్యాపారులు.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేంద్రం రైతుల డిమాండ్లను ఒప్పుకోవాలంటే మనమంతా వారికి మద్దతివ్వాలి’ అని హిందీలో కోరారు. అంతేకాక పంజాబ్, హరియాణా రైతులను ఒప్పించడం కేంద్రానికి అంత సులభం కాదన్నారు. (చదవండి: ‘కేజ్రీవాల్.. మొసలి కన్నీళ్లు కార్చొద్దు‘) View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) ఇక ఇప్పటికే రైతుల నిరసనకు పలువురు పంజాబ్ గాయకులు, నటులు మద్దతు తెలుపుతున్నారు. వీరిలో సిద్దూ మూసేవాలా, బబ్బూ మాన్లు కూడా ఉన్నారు. గాయకులు కన్వర్ గ్రెవాల్, హర్ఫ్ చీమా ఢిల్లీ సరిహద్దులో జరిగిన నిరసనలలో చేరారు. మొత్తం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన గాయకుడు జస్బీర్ జాస్సీ కూడా ఆందోళనకు తన మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన వేలాది మంది రైతులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్ని లెక్క చేయకుండా ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత కేంద్రం వీరిని ఢిల్లీలోకి అనుమతించలేదు.. ఆ తర్వాత పోలీసు పహారా మధ్య రైతులను రాజధానిలోని బురారీలోనికి రానిచ్చారు. -
మా ఆఫర్ ఇప్పటికీ ఉంది.. చూసుకోండి!
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ బీజేపీ ముందుకు వస్తే చర్చలకు సిద్ధమని ఉద్ధవ్ సంకేతాలు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకూడదనే లేఖ రాశామని వెల్లడి ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరే అంశంపై శివసేన పార్టీలో ఊగిసలాట కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరతామని చెపుతూనే.. బీజేపీ ముందుకు వచ్చినట్లయితే ప్రభుత్వంలో చేరే దిశగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని శివసేన సోమవారం సంకేతాలిచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన లేఖను శాసనసభ కార్యదర్శికి అందజేశామని, సేన శాసనసభాపక్ష నేత ఏక్నాథ్ షిండే పేరును ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని కోరామని శివసేన సీనియర్ నేత నీలమ్ గోర్హే విలేకరులకు తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో శివసేన భాగస్వామి కాబట్టి తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని, అందువల్లే తాము ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసనసభ కార్యదర్శికి లేఖ రాసినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే.. తమకు ఎటువంటి అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. అధికార పంపకంపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెపుతున్నారని, వారు ముందుకు వచ్చినట్లయితే తాము చర్చలు జరిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ప్రకటించారు. ‘మహా’ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం మహారాష్ట్ర శాసనసభ మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 12న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. కాషాయ తలపాగాలు ధరించి వచ్చిన శివసేన సభ్యులు ప్రతిపక్షాలకు కేటాయించిన బెంబీల్లో కూర్చున్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం కావడానికి ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సీనియర్ శాసనసభ్యుడు జీవ పండు గవిట్తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన అనంతరం గవిట్ కొత్త సభ్యులతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ స్పీకర్ అభ్యర్థిగా ఔరంగాబాద్ ఎమ్మెల్యే హరిభావు బాగ్డేని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా రాధాకృష్ణ విఖే పాటిల్ ఎన్నికయ్యారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచం: పవార్ న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ మైనారిటీ ప్రభుత్వాన్ని తాము అస్థిరపరచబోమని, అసెంబ్లీకి మళ్లీ వెంటనే ఎన్నికలు రాకుండా నివారించే లక్ష్యంతోనే ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. అయితే, బలమైన ప్రతిపక్షంగానే తమ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ మైనారిటీ ప్రభుత్వాన్ని బలపరచాలన్న నిర్ణయం వెనుక బీజేపీతో తమకు రహస్య ఎజెండా ఏదీలేదని, ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ సమష్టిగా తీసుకున్న నిర్ణయం మాత్రమేనని పవార్ సోమవారం ముంబైలో విలేకరులకు చెప్పారు.