Suraaj
-
విమల్‌తో వైగైపులి
తమిళసినిమా: యువ నటుడు విమల్‌తో కలిసి వైగైపులి వడివేలు నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న హాస్యనటుడు వడివేలుపై రెడ్ కార్డు పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఆయన మాత్రం అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా కొత్త చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా నటుడు విమల్‌తో కలిసి నటించనున్నారు. నటుడు విమల్ కథానాయకుడిగా నటించి నిర్మించిన మన్నర్ వగైయరా చిత్రం మంచి సక్సెస్‌ను అందించడంతో ఈయన కూడా ఇప్పుడు జోరు పెంచారు. మన్నర్ వగైయరా చిత్ర సక్సెస్‌తో పలువురు ప్రముఖ, యువ దర్శకులు విమల్‌తో చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే చిత్రాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న విమల్ ఈ ఏడాది అరడజను చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడు ఎళిల్‌తో కలిసి ఒక చిత్రం, సురాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. సురాజ్ దర్శకత్వంలో పోలీస్అధికారి పాత్రలో నటించనున్నారు. ఇందులో వడివేలు ప్రధాన పాత్రలో నవ్వించడానికి రెడీ అవుతున్నారు. వెట్ట్రివేల్ చిత్రం ఫేమ్ వసంతమణి, తమిళన్ చిత్రం ఫేమ్ మజిత్ దర్శకత్వంలోనూ విమల్ నటించడానికి అంగీకరించారు. అదేవిధంగా మన్నర్ వగైయరా చిత్రం ఫేమ్ భూపతి పాండియన్ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ఇలా ఈ ఏడాది ఆయన డైరీ ఫుల్ అయిపోయింది. ప్రస్తుతం నటిస్తున్న కన్నిరాశి చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నాయకిగా నటిస్తున్నారు. సర్గుణం దర్శకత్వంలో నటిస్తున్న కలవాణి 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. చిత్రపరిశ్రమ సమ్మె కారణంగా నిలిచిపోయిన కలవాణి 2 చిత్రం మే 3 నుంచి మళ్లీ మొదలుకానుంది. -
అలా అనడానికి ఆయన ఎవరు: నయనతార
హీరోయిన్లపై వివక్షపూరితమైన, లైంగికపరమైన వ్యాఖ్యలు చేసిన తమిళ దర్శకుడు సూరజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాజాగా విశాల్ హీరోగా 'ఒక్కడొచ్చాడు' తెరకెక్కించిన సూరజ్.. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ చేయకతప్పదని, అందుకే వారికి రెమ్యూనరేషన్ ఇస్తున్నామని పేర్కొన్నాడు. అంతేకాకుండా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను సంతృప్తిపరిచేందుకు హీరోయిన్లు పొట్టి దుస్తులు వేసుకొనక తప్పదని ఆయన అన్నాడు. తన సినిమాలో హీరోయిన్గా నటించిన తమన్నే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టగా సూరజ్ క్షమాపణలు చెప్పారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ నయనతార కూడా సూరజ్ వ్యాఖ్యలపై స్పందించింది. 'చిత్ర పరిశ్రమకు చెందిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి చీప్, అసభ్య వ్యాఖ్యలు ఎలా చేస్తారు? హీరోయిన్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసేందుకు సూరజ్ ఎవరు? హీరోయిన్లు స్ట్రిప్పర్లు అని, డబ్బులు ఇవ్వగానే వచ్చి దుస్తులు విప్పేసి నటిస్తారని ఆయన అనుకుంటున్నారా? తన ఇంట్లోని ఉద్యోగం చేసే మహిళల గురించి అలా మాట్లాడే దమ్ము ఆయనకు ఉందా?' అంటూ నయన తీవ్రస్థాయిలో మండిపడింది. -
తమన్నాకు సారీ చెప్పిన దర్శకుడు
రెమ్యూనరేషన్ కోసమే గ్లామర్ పాత్రలంటూ హీరోయిన్లపై నోరు పారేసుకున్న 'ఒక్కడొచ్చాడు' దర్శకుడు సురాజ్ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు క్షమాపణలు చెప్పాడు. తమన్నాతోపాటు, సిరీ పరిశ్రమలో్ని మిగిలిన హీరోయిన్లందరిపై చేసిన సెక్సిస్ట్ కామెంట్లకు సారీ చెబుతూ ఒక ప్రకటన జారీ చేశారు. సోమవారం మీడియాకు విడుదల ఒక ప్రకటనలో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. తన ఉద్దేశం అదికాదని, వారిని నొప్పించి ఉంటే క్షమించాలంటూ తమన్నా సహా అందరి కథానాయికలకు సారీ చెప్పాడు. ఇటీవల ఒక స్వతంత్ర యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సురాజ్ కధానాయికలుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రెమ్యూనరేషన్ కోసమే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి ఇష్టపడతారని వ్యాఖ్యానించాడు. అక్కడితో ఆయన పైత్యం చల్లారలేదు.. బి, సి సెంటర్లను 'సంతృప్తి' పరచడానికే పొట్టి బట్టలు ధరిస్తారన్నాడు. ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో దిగివచ్చిన దర్శకుడు చివరికిలా క్షమాపణలు తెలిపాడు. కాగా విశాల్ తాజా చిత్రం 'కత్తి సాందాయ్' తెలుగులో ఒక్కడొచ్చాడు టైటిల్ తో . సూరజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.