తమన్నాకు సారీ చెప్పిన దర్శకుడు | Director Suraaj apologises to Tamannaah for his sexist comments | Sakshi
Sakshi News home page

తమన్నాకు సారీ చెప్పిన దర్శకుడు

Published Mon, Dec 26 2016 8:17 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

తమన్నాకు సారీ చెప్పిన దర్శకుడు - Sakshi

తమన్నాకు సారీ చెప్పిన దర్శకుడు

రెమ్యూనరేషన్ కోసమే గ్లామర్ పాత్రలంటూ  హీరోయిన్లపై నోరు పారేసుకున్న  'ఒక్కడొచ్చాడు' దర్శకుడు  సురాజ్‌  టాలీవుడ్ మిల్కీ  బ్యూటీ తమన్నాకు క్షమాపణలు చెప్పాడు.  తమన్నాతోపాటు, సిరీ పరిశ్రమలో్ని మిగిలిన హీరోయిన్లందరిపై చేసిన సెక్సిస్ట్ కామెంట్లకు  సారీ  చెబుతూ ఒక ప్రకటన జారీ చేశారు.

సోమవారం మీడియాకు విడుదల ఒక ప్రకటనలో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు  తెలిపారు.  తన ఉద్దేశం అదికాదని, వారిని నొప్పించి ఉంటే  క్షమించాలంటూ తమన్నా సహా అందరి కథానాయికలకు సారీ చెప్పాడు.

ఇటీవల ఒక స్వతంత్ర యూ ట్యూబ్  ఛానెల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో, సురాజ్ కధానాయికలుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.  రెమ్యూనరేషన్ కోసమే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి  ఇష్టపడతారని వ్యాఖ్యానించాడు.  అక్కడితో ఆయన పైత్యం చల్లారలేదు.. బి, సి సెంటర్లను  'సంతృప్తి' పరచడానికే పొట్టి బట్టలు ధరిస్తారన్నాడు.  ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో పై తీవ్ర విమర్శలు  ఎదుర్కొన్న నేపథ్యంలో దిగివచ్చిన దర్శకుడు చివరికిలా  క్షమాపణలు  తెలిపాడు.
కాగా  విశాల్ తాజా చిత్రం 'క‌త్తి సాందాయ్' తెలుగులో ఒక్కడొచ్చాడు టైటిల్ తో . సూరజ్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement