అలా అనడానికి ఆయన ఎవరు: నయనతార | Nayanthara comments on Suraaj | Sakshi
Sakshi News home page

అలా అనడానికి ఆయన ఎవరు: నయనతార

Published Mon, Dec 26 2016 8:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

అలా అనడానికి ఆయన ఎవరు: నయనతార

అలా అనడానికి ఆయన ఎవరు: నయనతార

హీరోయిన్లపై వివక్షపూరితమైన, లైంగికపరమైన వ్యాఖ్యలు చేసిన తమిళ దర్శకుడు సూరజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాజాగా విశాల్‌ హీరోగా 'ఒక్కడొచ్చాడు' తెరకెక్కించిన సూరజ్‌.. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్లు గ్లామరస్‌ రోల్స్‌ చేయకతప్పదని, అందుకే వారికి రెమ్యూనరేషన్‌ ఇస్తున్నామని పేర్కొన్నాడు. అంతేకాకుండా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను సంతృప్తిపరిచేందుకు హీరోయిన్లు పొట్టి దుస్తులు వేసుకొనక తప్పదని ఆయన అన్నాడు. తన సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టగా సూరజ్‌ క్షమాపణలు చెప్పారు.

తాజాగా ప్రముఖ హీరోయిన్‌ నయనతార కూడా సూరజ్‌ వ్యాఖ్యలపై స్పందించింది. 'చిత్ర పరిశ్రమకు చెందిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి చీప్‌, అసభ్య వ్యాఖ్యలు ఎలా చేస్తారు? హీరోయిన్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసేందుకు సూరజ్‌ ఎవరు? హీరోయిన్లు స్ట్రిప్పర్లు అని, డబ్బులు ఇవ్వగానే వచ్చి దుస్తులు విప్పేసి నటిస్తారని ఆయన అనుకుంటున్నారా? తన ఇంట్లోని ఉద్యోగం చేసే మహిళల గురించి అలా మాట్లాడే దమ్ము ఆయనకు ఉందా?' అంటూ నయన తీవ్రస్థాయిలో మండిపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement