surendrasing
-
ప్రధాని, సీఎంపై ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు దేశ అత్యున్నత న్యాయస్థానమే అయోధ్య భూవివాదం కేసుపై ఆచితూచి అడుగులేస్తుండగా.. మరోవైపు బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బాలియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా ఉన్న యోగీ ఆదిత్యనాథ్.. అయోధ్యలో రామాలయం నిర్మించకుండా ఏం చేస్తున్నారు. హిందుత్వ వాదులు అంత గొప్ప స్థానాల్లో ఉండగా.. రాముడు ఇంకా టెంట్లలో ఉండడమా’ అని అసహనం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో సురేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. (అయోధ్యపై సత్వర విచారణకు నో) మోదీ, యోగీ స్థానంలో ఇంకెవరున్నా ఈ పాటికి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి ఉండేదని చెప్పారు. కరుడు గట్టిన హిందుత్వ వాదులు ఏలుతున్న దేశంలో రాముడు ఇంకా టెంట్లోనే ఉండడం బాధాకరమన్నారు. ఇది హిందూ జాతికే దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దనీ..దేవుడి ఆశిస్సులతో ఆలయ నిర్మాణం త్వరలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాముడు ఎప్పడు తలచుకుంటే అప్పుడే ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. 2010లో అలహాబాద్ కోర్టు అయోధ్యలోని వివాదాస్పద రామాలయం-బాబ్రీ మసీదు భూమిని మూడు భాగాలుగా చేసి పంచాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో వాదనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై వచ్చే ఏడాది జనవరిలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. Modi ji jaisa mahan PM ho wo bhi hinduvadi aur Yogi ji jaisa mahan hinduvadi neta CM ho, uss samay bhi Bhagwan Ram tent mein rahen, isse bada durbhagya Bharat aur Hindu samaj ke liye nahi hone wala. Aisi paristhiti banai jaani chahiye ki Ram mandir Ayodhya mein bane: S Singh,BJP pic.twitter.com/Nmq2UN5ijo — ANI UP (@ANINewsUP) November 17, 2018 -
‘మోదీ రాముని అవతారం’
బలియా: మన ప్రధాని నరేంద్రమోదీ శ్రీరాముడి అవతారం. ఆ శ్రీరాముడికి లక్ష్మణుడిలా ఈ మోదీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోదర సమానుడు. అవసరమైన సందర్భాల్లో ఆయన చాణక్యుడిలా ఈ రాముడికి సలహాలిస్తుంటారు. రాముడి నమ్మినబంటైన హనుమంతుడి అవతారమే బ్రహ్మచారి అయిన నేటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఈ ముగ్గురు మనకోసం మళ్లీ రామరాజ్యం తీసుకువస్తారు’ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజా వ్యాఖ్యలివి. ప్రధాని మోదీని రాముడితో పోలుస్తూ ఆయన శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ ఎమ్మెల్యేనే పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీని శూర్పనఖతో పోల్చి, వివాదం సృష్టించారు. -
‘అర్బన్ ఫోక్ మ్యూజిక్
‘భూక్ రోటీ కీ హయ్ తుఝే... ధూండే ఫిర్ క్యోం తూ తుక్డే జమీన్ కీ...’ (అన్నం కోసం ఆకలి వేస్తే భూమిని ఎందుకు లాక్కుంటున్నావ్) అంటూ సామాజిక చైతన్యం రగిలించింది ‘అర్బన్ ఫోక్ మ్యూజిక్’. బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం జనసంవాద్ బ్యాండ్ ప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి కర్త, కర్మ, క్రియ అయిన సురేంద్రసింగ్ నేగి... సామాజిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా వినూత్నంగా సంగీతాన్ని ఎన్నుకున్నారు. ‘టాక్ టు పీపుల్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో ప్రజా చైతన్యం కోసం ముందుకు సాగుతున్న సురేంద్రసింగ్‌ను ‘సిటీ ప్లస్’ పలకరించింది... మాది దిల్లీ. మొదటి నుంచీ సామాజిక సమస్యలపై అవగాహన ఎక్కువ. దిల్లీ యూనివర్సిటీ నుంచి స్పానిష్‌లో పీహెచ్డీ చేశా. తరువాత ఇఫ్లూలో స్పానిష్ లెక్చరర్‌గా అవకాశం వచ్చింది. చదువుకునే రోజుల్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం ఆలోచింపజేసింది. అప్పుడే సమాజం కోసం నా వంతుగా ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పటి నుంచి మతసామరస్యం, ఆడవారిపై దాడులు, వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, కశ్మీర్లో మతపరమైన దాడులు, రైతుల ఆత్మహత్యలు, భూ సేకరణ... ఇలా సామాజిక అంశాలను ఎంచుకుని పాటలు రాశా. అదే సమయంలో నాలాంటి ఆలోచనలే కలిగిన తారీఖ్షేఖ్ (బెంగాల్), బేస్ గిటార్ స్పెషలిస్టు సుమిత్ భండారీ (దిల్లీ), ఫ్లూట్ స్పెషలిస్టు దీపక్ సేన్వాల్ (ఫ్లూట్ స్పెషలిస్టు), తబలా ప్లేయర్ సావన్ (హైదరాబాద్)తో పరిచయం ఏర్పడింది. ఆ నలుగురితో కలసి ‘జన్‌సంవాద్’ బ్యాండ్‌కు శ్రీకారం చుట్టాం. 2012లో తొలిసారిగా ఇఫ్లూలో అర్బన్ ఫోక్ మ్యూజిక్ ప్రదర్శన ఇచ్చాం. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, లామకాన్‌లో నిర్వహించిన మా కన్సర్ట్కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. అలాగే దిల్లీ, బీహార్లలో కూడా ప్రదర్శనలిచ్చాం. ఎక్కడికెళ్లినా మా ఆలోచనకు జేజేలు దక్కాయి. నా మ్యూజిక్ వల్ల వందమందిలో ఒకరు మారినా ఆనందమే. డిఫరెంట్ వాయిద్యాలు... అర్బన్ ఫోక్ మ్యూజిక్‌లో విభిన్న రకాల వాయిద్యాలు ఉపయోగిస్తున్నాం. త్రీ టైమ్స్ గిటార్, రిథమ్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, దేశ్ గిటార్, తబలా, ఫ్లూట్, డోలక్లను వాడుతున్నాం. మా టీమ్‌లోని సభ్యులమంతా నగర నేపథ్యం ఉన్నవారం కాబట్టి... ‘అర్బన్ ఫోక్ మ్యూజిక్’ను ఎంచుకున్నాం. నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ఈ మ్యూజిక్ చాలా ఉపయోగపడుతోంది. మ్యూజిక్ ప్లే చేసి ప్రజల్లో సామాజిక మార్పు తీసుకొచ్చే దిశగా సాగుతున్నాం. ఇప్పటికే పల్లెల్లో ఘల్లుమంటున్న జానపదానికే సరికొత్త బాణీలు చేర్చి ఇష్యూస్ రైజ్ చేసేలా పాటలు పాడుతున్నాం. - వాంకె శ్రీనివాస్