‘మోదీ రాముని అవతారం’ | narendra modi as a lord rama | Sakshi
Sakshi News home page

‘మోదీ రాముని అవతారం’

Published Sat, May 12 2018 4:38 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

narendra modi as a lord rama - Sakshi

బలియా: మన ప్రధాని నరేంద్రమోదీ శ్రీరాముడి అవతారం. ఆ శ్రీరాముడికి లక్ష్మణుడిలా ఈ మోదీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సోదర సమానుడు. అవసరమైన సందర్భాల్లో ఆయన చాణక్యుడిలా ఈ రాముడికి సలహాలిస్తుంటారు. రాముడి నమ్మినబంటైన హనుమంతుడి అవతారమే బ్రహ్మచారి అయిన నేటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌. ఈ ముగ్గురు మనకోసం మళ్లీ రామరాజ్యం తీసుకువస్తారు’ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ తాజా వ్యాఖ్యలివి. ప్రధాని మోదీని రాముడితో పోలుస్తూ ఆయన శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ ఎమ్మెల్యేనే పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీని శూర్పనఖతో పోల్చి, వివాదం సృష్టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement