lord ram-laxman
-
శాంతాత్ముల సహనం..!
సీతమ్మను లంకాధిపతియైన రావణుడు అపహరించి తీసుకువెళ్ళి లంకలోని అశోకవనంలో దాచాడు. అది తెలుసుకున్న శ్రీరాముడు వెంటనే సముద్రాన్ని దాటి లంకకు చేరే ప్రయత్నం మొదలుపెట్టాడు. తెప్పలు కట్టుకుని దాటడానికి ఎదురుగా ఉన్నది చిన్న నది కాదు కాబట్టి, సముద్రుడిని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం అని విభీషణుడు సలహా ఇచ్చాడు. దాన్ని అంగీకరించాడు శ్రీరాముడు, సముద్రుడిని దారి వదలమని ప్రార్థించడానికి పూనుకున్నాడు.సముద్ర తీరంలోని ఇసుకపై దర్భలతో తయారుచేయబడిన చాపమీద తన కుడిభుజాన్ని తలగడగా చేసుకుని శయనించి ఏకాగ్ర చిత్తంతో సాగరుడిని ప్రసన్నం కమ్మని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా విభావరులొక మూడు గడిచాయట! అనగా మూడు రాత్రులు గడిచాయి శ్రీరాముడి జీవితంలో! మూడురోజులు ప్రార్థించినప్పటికీ సముద్రుడి నుండి సమాధానం రాకపోవడంతో సహనం కోల్పోయాడు శ్రీరాముడు.పక్కనే ఉన్న లక్ష్మణుడితో ‘తమ్ముడా, ఈ సముద్రుడు నన్ను అసమర్థుడిగా జమకట్టాడు. ఇతడితో సహనం పాటించడం వివేకంతో కూడుకున్న పని కాదు. ఇతడు దారికి రావాలంటే దండన ఒక్కటే ఇప్పుడు మిగిలున్న మార్గం. బాణాగ్ని చేత ఈ సాగరుడిని శోషింపజేసి, మన సైన్యం నడిచి వెళ్ళడానికి దారి కల్పిస్తాను!’ అని శక్తిమంతమైన ఒక బాణాన్ని సంధించి సముద్రుడి మీదికి వదిలాడు శ్రీరాముడు.దశదిశలలో దారుణ అగ్నిశిఖలను విరజిమ్ముతూ ఆ బాణం సముద్రంలో ప్రవేశించగానే, నిలువెల్లా వణికిపోతూ సముద్రుడు పరుగున వచ్చి శ్రీరాముడి ముందు నిలిచాడు. సుముద్రుడి అప్పటి అవస్థను ఏనుగు లక్ష్మణకవి తన ‘రామేశ్వర మాహాత్మ్యము’, ప్రథమాశ్వాసంలోని ఈ క్రింది కంద పద్యంలో అలతి మాటలలో వర్ణించాడు."కోపంబు సంహరింపుమునీ పదకమలములు గొలిచి నిల్చిన నన్నుంజేపట్టుము మ్రొక్కెద, నాచాపలము సహింపు రామ సద్గుణధామా!"‘కోపాన్ని ఉపసంహరించుకో శ్రీరామా! నీ పాదములపై వాలి వేడుకుంటున్న నన్ను సేవకుడిగా భావించి ఆదరించు! సద్గుణాలకు నెలవైన ఓ స్వామీ, నా తెలివితక్కువ చేష్టకు నన్ను దయతో మన్నించు!’ అని సముద్రుడు వేడుకున్నాడు. ధీరులు, శాంతాత్ములు, పరమాత్మ స్వరూపులుగా ఉండేవారి సహనాన్ని పరీక్షించే చాపల్యపు పనికి పూనుకుంటే, సముద్రుడంతటి వాడికైనా భంగపాటు తప్పదని పై సన్నివేశం బోధిస్తుంది. – భట్టు వెంకటరావు -
‘మోదీ రాముని అవతారం’
బలియా: మన ప్రధాని నరేంద్రమోదీ శ్రీరాముడి అవతారం. ఆ శ్రీరాముడికి లక్ష్మణుడిలా ఈ మోదీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోదర సమానుడు. అవసరమైన సందర్భాల్లో ఆయన చాణక్యుడిలా ఈ రాముడికి సలహాలిస్తుంటారు. రాముడి నమ్మినబంటైన హనుమంతుడి అవతారమే బ్రహ్మచారి అయిన నేటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఈ ముగ్గురు మనకోసం మళ్లీ రామరాజ్యం తీసుకువస్తారు’ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజా వ్యాఖ్యలివి. ప్రధాని మోదీని రాముడితో పోలుస్తూ ఆయన శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ ఎమ్మెల్యేనే పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీని శూర్పనఖతో పోల్చి, వివాదం సృష్టించారు. -
అన్న మాట
రామ–లక్ష్మణ–భరత–శత్రుఘ్నులు అనే నలుగురు ఆదర్శ సోదరులుగా సుప్రసిద్ధిని పొంది ఉన్నారు. శ్రీరాముని వదిలి ఉండలేని లక్ష్మణుడు తనను కూడా అరణ్యానికి తీసుకుపొమ్మని శ్రీరామునితో వాదులాడి అంగీకారాన్ని పొందాడు. అరణ్యవాస సమయంలో సీతారాములకు వివిధ సేవలను అందించాడు. శ్రీరామచంద్రుడే రాజ్యాన్ని పాలించుటకు సమ ర్థుడు, అర్హుడు అని భావించిన భరతుడు సపరివా రంగా అరణ్యానికి వెళ్లాడు. రాజ్యాన్ని పరిపాలించటా నికి తిరిగి అయోధ్యకు రమ్మని శ్రీరాముణ్ణి కోరాడు. మీరు రాజ్యపాలన చేయటానికి అంగీకరించే వరకు నేను నీరు కూడా తీసుకోకుండా కఠినోపవాస దీక్షను చేస్తాను అని గట్టిగా తన అభిప్రాయాన్ని భర తుడు వెలిబుచ్చాడు. అయినప్పటికీ శ్రీరాముని ఆజ్ఞను పాటిస్తూ మహర్షుల, సిద్ధుల, గంధర్వుల ఉపదే శాలను శిరసావహిస్తూ భరతుడు రాజ్యపాలన బాధ్యతను స్వీకరిం చాడు. లక్ష్మణునివలె మొండిపట్టు పట్ట లేదు. పితృవాక్య పరిపాలనా వ్రతాన్ని తాను కొనసా గిస్తున్నానని, 14 ఏళ్లు పూర్తికాగానే తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని స్వీకరిస్తానని, అంతవరకు రాజ్య పరిపాలనలో నీకు ఈ పాదుకలు సహాయంగా ఉంటా యని భరతునితో శ్రీరాముడు పలికాడు. భరతుడు అంగీకార సూచకంగా శ్రీరామ పాదుకలను స్వీక రించి శిరస్సుపై ధరించాడు. అన్నకు ప్రదక్షిణం చేసి ఆజ్ఞ తీసుకొని నంది గ్రామానికి చేరి శ్రీరామ పాదు కలను రాజసింహాసనంపై ఉంచి శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం 14 ఏళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు. తాను రాజ్యాన్ని వదలటానికి, ఈ అరణ్యానికి రావటానికి కారణం కైకేయియే అనే భావనతో భర తుడు కైకేయిని కోపంతో నిందిస్తాడేమోనని శ్రీరా ముడు ఊహించాడు. అందుకే ఓ భరతా! నీవు కైకేయి మాతను దూషించవద్దు. ఆమెపై రోషాన్ని తెచ్చు కోవద్దు. ఆమెను కాపాడు.. అని శ్రీరాముడు భరతుణ్ణి ఆజ్ఞా పించాడు. అన్నమాట ప్రకారం భరతుడు రాజ్యాన్ని సక్ర మంగా పాలించి రాజ్యంయొక్క అభివృద్ధికి పాటు పడటమే కాకుండా కైకేయిపట్ల కూడా ఆదరభావాన్ని చూపాడు. శ్రీరాముడు అరణ్యం నుండి తిరిగి వచ్చి నాక అన్నగారూ! మీ మాట ప్రకారం నా తల్లి కైకేయిని గౌరవ భావంతో ఆదరించాను. ఆమెను కోపగించ లేదు. మీ ఆజ్ఞను పాటిస్తూ మీ ప్రతినిధిగా మీ పాదు కలు ముందు పెట్టుకొని ప్రజాసేవ చేశాను. తిరిగి మీకు రాజ్యాన్ని సమర్పిస్తున్నాను.. అని భరతుడు శ్రీరామ పట్టాభిషేక సమయంలో విన్నవించాడు. అన్నమాటను జవదాటని భరతుని భ్రాతృభక్తి ప్రశంసనీయమైనది. (వ్యాసకర్త : సముద్రాల శఠగోపాచార్యులు)