Surgical operation
-
కడుపునకు రంధ్రంతో శిశువు జననం
పెద్దదోర్నాల: కడుపులో ఉండాల్సిన పేగులు బయటే ఉన్న ఓ మగశిశువు పెద్దదోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం పురుడు పోసుకున్నాడు. పెద్దదోర్నాల మండల పరిధిలోని మర్రిపాలెం గిరిజన గూడేనికి చెందిన తొలిచూలు గర్భిణి కుడుముల రామక్క శనివారం ప్రసవ వేదనతో కాన్పు కోసం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో చేరింది. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ దస్తగిరి, యిలియాజ్‌లు సిబ్బంది పర్యవేక్షణలో కాన్పును నిర్వహించారు. కాన్పు చేసిన వైద్య సిబ్బంది పేగులతో జన్మించిన మగశిశువును చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గర్భాశయంలో ఎదుగుదలలో ఉన్నప్పుడు శిశువు కడుపు గోడలు కలుసుకోక పోవటం వల్ల కడుపు పై భాగంలో రంధ్రం ఏర్పడి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. నెలలు నిండకపోవడం, కడుపున కు రంధ్రం ఏర్పటం వల్ల శిశువు ఈ విధంగా పుట్టిందన్నారు. శస్త్ర చికిత్స ద్వారా చిన్నారికి మెరుగైన వైద్యం అందించవచ్చని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ప్రాథమిక జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. చిన్నారిని వైద్యశాలలో శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించినట్టు డాక్టర్ దస్తగిరి తెలిపారు. -
‘పోటు’ పెరుగుతుంది!
అసలే హార్ట్ పేషంట్లు.. ఆపై భారత్-పాక్ మ్యాచ్.. ఇంకేముంది... ఈ మ్యాచ్ గనుక చూస్తే పేషంట్ల పోటు పెరగడం ఖాయమని పాకిస్తాన్‌లోని గుజ్రాన్వాలాలోని ఆసుపత్రులు బాగా గ్రహించినట్లున్నాయి. వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలలోని కార్డియో వార్డుల్లో ఉన్న టీవీ సెట్లను తొలగించాలని నిర్వాహకులు ఓ ఆర్డర్ జారీ చేశారు. డాక్టర్లు, శస్త్రచికిత్స నిపుణుల సూచన మేరకు ఈ నిర్ణయాన్ని గుజ్రాన్వాలాప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదలుపెట్టారు. తర్వాత అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు విస్తరించామని సీనియర్ డాక్టర్ మతీన్ తెలిపారు. -
కిమ్స్‌లో సెరిబ్రల్‌పాల్సీ బాధితునికి శస్త్రచికిత్స
ఈ తరహా శస్త్రచికిత్స దేశంలోనే మొట్టమొదటిదని వైద్యుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ (శరీర కదలికలను నియంత్రించే శక్తిని మెదడు కోల్పోవడం)తో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్సతో కృత్రిమ తుంటిని విజయవంతంగా అమర్చారు. ఈ తరహా చికిత్సను అందించడం దేశంలోనే ఇది తొలిసారని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు. వరంగల్ జిల్లా తొర్రూర్‌కు చెందిన శ్రీశైలం(40) పుట్టుకతోనే సెరిబ్రల్‌పాల్సీతో బాధపడుతున్నాడు. మూడేళ్ల క్రితం ప్రమాదశాత్తూ జారీ కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగి కాళ్లు, చేతులు చచ్చు బడి పోయాయి. వైద్య పరిభాషలో దీన్ని (క్వాడ్రీపారిసిస్)గా పిలుస్తారు. దీంతో గత మూడేళ్ల నుంచి ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది క్రితం కిమ్స్‌లోని ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయ్‌కృష్ణను కలిశాడు. పరీక్షించి, పలు వైద్య పరీక్షలు చేయించారు. బాధితుని తుంటికి సరితూగే కృత్రిమ బాల్‌ను విదేశాల్లో తయారు చేయించారు. ఇటీవలే ఆయనకు మెటికులస్ ప్లానింగ్ ద్వారా శస్త్రచికిత్స చేసి దెబ్బతిన్న తుంటి భాగంలో కృత్రిమ తుంటిని అమర్చారు. చికిత్స చేసిన పది రోజులకే ఆయనస్వయంగా లేచి నిలబడుతున్నాడని, మరో మూడు నెలల్లో ఆయన స్వయంగా లేచి నిలబడటంతో పాటు ఎవరి సహాయం అవసరం లేకుండానే నడ వగలడని వైద్యులు స్పష్టం చేశారు. చికిత్సకు రూ. 6 లక్షలు ఖర్చు అవుతుండగా, రోగి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తాము కేవలం రూ.2 లక్షలకే ఈ శస్త్రచికిత్స చేసిన ట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గోపి పాల్గొన్నారు. -
ఫుల్ జోష్‌లో ప్రభాస్!
దాదాపు రెండు నెలలుగా ప్రభాస్ ఇంటిపట్టునే ఉన్నారు. ఏప్రిల్‌లో భుజానికి జరిగిన శస్త్ర చికిత్స కారణంగా ఆయన విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న సమయంలో... ‘నాకేం ఫర్వాలేదు కోలుకుంటున్నా’ అని ఫేస్బుక్ ద్వారా ఆయన పేర్కొనడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఇక, ఇటీవల ‘రన్ రాజా రాజా’ ఆడియో వేడుకలోనూ, గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలోనూ ప్రభాస్ పాల్గొన్నారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోల్లో ప్రభాస్ ఎనర్జిటిక్‌గా కనిపించడంతో, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని చాలామంది ఊహించారు. ఆ ఊహ నిజమే. సోమవారం నుంచి ఆయన ఫుల్ జోష్‌గా ‘బాహుబలి’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘‘మా కెప్టెన్ (దర్శకుడు రాజమౌళి) వరుసగా షూటింగ్ ప్లాన్ చేశారు. నూతనోత్సాహంతో ఈ షూటింగ్లో పాల్గొంటున్నా’’ అని ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు ప్రభాస్.