అసలే హార్ట్ పేషంట్లు.. ఆపై భారత్-పాక్ మ్యాచ్.. ఇంకేముంది... ఈ మ్యాచ్ గనుక చూస్తే పేషంట్ల పోటు పెరగడం ఖాయమని పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలాలోని ఆసుపత్రులు బాగా గ్రహించినట్లున్నాయి. వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలలోని కార్డియో వార్డుల్లో ఉన్న టీవీ సెట్లను తొలగించాలని నిర్వాహకులు ఓ ఆర్డర్ జారీ చేశారు.
డాక్టర్లు, శస్త్రచికిత్స నిపుణుల సూచన మేరకు ఈ నిర్ణయాన్ని గుజ్రాన్‌వాలాప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదలుపెట్టారు. తర్వాత అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు విస్తరించామని సీనియర్ డాక్టర్ మతీన్ తెలిపారు.
‘పోటు’ పెరుగుతుంది!
Published Mon, Mar 21 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement
Advertisement