Survey intelligence
-
ఊళ్లో పరిస్థితి ఎట్లుందే?
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఊహించని షాకులిస్తున్న అధికార టీఆర్ఎస్.. సమాంతరంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలకు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రజల నాడి తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఈ పనిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు తలమునకలైనట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజవర్గంలో ఒక్కో మండలానికి ఓ పోలీసు అధికారి (హెడ్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ)తో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రతీ అసెంబ్లీకి కనీసం 4 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా 28 నుంచి 30 మంది వరకు పోలీసులు సర్వేలో పాల్గొంటున్నారు. 16 ఎంపీ సీట్లే లక్ష్యంగా... శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడూ అనుసరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లు లక్ష్యంగా బరిలోకి దిగిన ఆ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇద్దరు స్వతంత్రులు టీఆర్ఎస్లో చేరారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కూడా కలుపుకుంటే పార్టీ బలం 91కి చేరింది. ఇక మిత్రపక్షం ఎంఐఎం 7 స్థానాలు కలిపితే ప్రభుత్వానికి 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ బలం మద్దతుదారులతో కలిపి 101కి చేరింది. 16 ఎంపీ సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీఆర్ఎస్ ఈసారి 100 శాతం సఫలీకృతం కావాలని పావులు కదుపుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని జోరు మీదున్న కారు పార్టీ అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ ఏ మేరకు ఉందో తెలుసునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలు తీరు, పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతుబంధు తదితరాల విషయంలో లబ్ధిదారుల అభిప్రాయాలపై ఇంటెలిజెన్స్ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ప్రజాభిప్రాయాన్ని మొత్తంగా క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు. మరో రెండుసార్లు సర్వే? ఇప్పుడు జరుగుతున్న సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేశాక మరో రెండుసార్లు సర్వే చేయించనున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ వచ్చాక ఒకసారి, బీ–ఫారాలు ఇచ్చాక రెండోసారి సర్వే జరుగనుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు ఎన్నికలపై పడతాయా? అన్న విషయంలోనూ సర్వే జరగనుంది. జాతీయ అంశాలు కీలకంగా ఎన్నికలు జరిగితే... టీఆర్ఎస్ అనుకున్న 16 సీట్లు గెలవడం క్లిష్టమవుతుంది. అందుకే, నోటిఫికేషన్ వచ్చాక, బీ–ఫారాలు ఇచ్చాక మరోసారి సర్వే జరగనుందని సమాచారం. -
మధ్యప్రదేశ్‌లో కమలానికి షాక్..!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడవడం కమలనాధులను కలవరపరుస్తోంది. అక్టోబర్ 30న ముఖ్యమంత్రి చౌహాన్‌కు ఇంటెలిజెన్స్ విభాగం ఈ మేరకు సమర్పించిన రహస్య నివేదిక బీజేపీలో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్ధానాల్లో 128 స్ధానాల్లో పాలక బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. బీజేపీ కేవలం 92 సీట్లలోనే గెలుపొందే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఆరు సీట్లలో, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ మూడు సీట్లలో విజయం సాధించవచ్చని నివేదిక అంచనా వేసింది. రుస్తం సింగ్, మాయా సింగ్, గౌరీ శంకర్ షెజ్వార్, ఎస్పీ మీనా సహా పది మంది మంత్రులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అతితక్కువగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు సీఎం చౌహాన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఎస్పీ మీనా పార్టీ టికెట్ రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ నివేదిక ముఖ్యమంత్రికి చేరిన రెండు రోజుల తర్వాతే తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం గ్వాలియర్ చంబల్ డివిజన్లోని 34 స్ధానాలకు గాను 24 స్ధానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీ కేవలం ఏడు సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తుండగా, మిగిలిన మూడు సీట్లలో బీఎస్పీకి విజయావకాశాలున్నాయి. వింధ్య ప్రాంతంలోని 30 స్ధానాల్లో కాంగ్రెస్ 18 స్ధానాల్లో ప్రత్యర్ధుల కంటే పైచేయి సాధించగా, బీజేపీ 9 స్ధానాల్లో, బీఎస్పీ మూడు స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక మహాకోశల్ ప్రాంతంలోని 38 స్ధానాల్లో కాంగ్రెస్ 22 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 13 స్ధానాల్లో నెగ్గే అవకాశం ఉంది. ఎస్పీ రెండు స్ధానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇక రైతు ఆందోళనలు, పోలీసు కాల్పులతో అట్టుడికిన మాల్వా నిమర్ ప్రాంతంలో కాంగ్రెస్ 34 స్ధానాల్లో, బీజేపీ 32 స్ధానాల్లో గెలిచే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. -
జగిత్యాలలో ఏపీ ఇంటెలిజెన్స్ రహస్య సర్వే!
సాక్షి, జగిత్యాల: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ పోలీసుల రహస్య సర్వే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసుల సర్వే పలు అనుమానాలకు దారి తీస్తోంది. వారం క్రితం కోరుట్ల నియోజకవర్గానికి చెందిన ఓ పార్టీ వలస నేతను (ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు) ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు కలవడం.. తిరిగి సొంతగూటికి రావాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ నెల 26న ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన ముగ్గురు ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్య సర్వే నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అభ్యర్థుల విజయావకాశాలపై స్థానికులతో ఆరా తీస్తూ జిల్లా పోలీసులకు చిక్కారు. ఏపీ పోలీసుల మాటతీరును గమనించిన స్థానికులు.. విషయాన్ని ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన ధర్మపురి పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాము ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెం దిన వాళ్లమని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యా రు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు డబ్బులు కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసులు రాష్ట్రంలో సర్వే నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. జిల్లాలోనే మకాం? ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది 25 మంది 15 రోజుల నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మకాం వేసినట్లు తెలుస్తోంది. కోరుట్ల, ధర్మపురిలో వెలుగుచూసిన ఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ ఏపీ పోలీసులు సామాన్య వ్యక్తుల్లా సర్వే చేస్తుండటంతో విషయం వెలుగులోకి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమిలో ఓ పార్టీ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమం లో ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ స్థితిగతులు, నాయకులపై ఆరా తీస్తున్నారని ధర్మపురి ఘటనతో స్పష్టమైం ది. సామాన్య వ్యక్తుల్లా సర్వే చేస్తుండటంతో తమ కం టబడలేదని జిల్లా పోలీసులు చెబుతున్నారు. కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బందిని స్థానిక పోలీసులు విచారణ లేకుండానే వదిలిపెట్టడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. వారిని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ధర్మపురి ఎస్ఐ అంజయ్య వివరణ ఇస్తూ, ‘ధర్మపురిలో అనుమానాస్పదస్థితిలో ముగ్గురు తిరుగుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్లూ కోల్ట్స్ బృందాన్ని పంపించాం. అక్కడికెళ్లాక వారు హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులమని చెప్పడం తో అక్కడి నుంచి వచ్చేశాం’ అని చెప్పారు. -
అనర్హుల చేతిలో ‘అన్నపూర్ణ’!
సగానికిపైగా దుర్వినియోగం ధనవంతులకూ ‘ఆహారభద్రత’ నిఘావర్గాల సర్వేలో తేలిన నిజాలు! పేదలకే దక్కాల్సిన సంక్షేమ పథకా లు పక్కదారి పట్టాయి. అనాథలు, ఏ ఆసరా లేనివారికి దక్కాల్సిన అన్నపూర్ణ కార్డులు, నిరుపేదల అం త్యోదయ అన్నయోజన కార్డులు అనర్హుల చేతికి చేరాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే దక్కాల్సిన ఆహార భద్రత కార్డులు కోటీశ్వరులకూ అందాయి. అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులకు సంబంధించి ఇటీవల నిఘా వర్గాలు నిర్వహించిన సర్వేలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూసినట్లు తెలిసింది. సగానికిగా అనర్హుల వద్దే ఉన్నట్లు సమాచారం. సాక్షి, కామారెడ్డి : ఏ ఆసరా లేని నిరుపేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం అభాసుపాలవుతోంది. అనర్హులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. ఏ ఆసరా లేని వారికి అన్నపూర్ణ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డు కలిగిన వారికి ఉచితంగా నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు. అయితే అనర్హులకు సైతం ఈ కార్డులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇటీవల నిఘా వర్గాల ద్వారా ఆరా తీసింది. కామారెడ్డి జిల్లాలో అన్నపూర్ణ కార్డులు 1,087 ఉన్నాయి. ఇందులో సగానికి పైగా అనర్హుల చేతిలో ఉన్నట్లు నిఘా వర్గాల సర్వేలో తేలినట్లు సమాచారం. అంత్యోదయ కార్డులదీ అదేదారి అంత్యోదయ కార్డుల ద్వారా నిరుపేద కుటుంబాలకు రూపాయికి కిలో చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తారు. జిల్లాలో 16,425 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు సైతం నిరుపేదలతోపాటు ఇతరులకూ అందాయని సర్వేలో తేలి నట్లు సమాచారం. సాధారణంగా ఆహార భద్రత కార్డుల ద్వా రా కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం మాత్రమే ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్న వారికి మాత్రం కుటుంబ సభ్యుల సంఖ్యకు సంబందం లేకుండా 35 కిలోల బియ్యం ఇస్తారు. నిరుపేద కుటుంబాలకు ఈ పథకాలు వర్తిస్తాయి. కానీ రాజకీయ పార్టీల నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికార యంత్రాంగం అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడం పరిపాటిగా మారింది. కోటీశ్వరులకూ ‘ఆహార భద్రత’ జిల్లాలో 2,28,527 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. దారి ద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఈ కార్డులు ఇవ్వాల్సి ఉం టుంది. అయితే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండి, ఆదాయ పు పన్ను చెల్లించేవారికి సైతం ఆహార భద్రత కార్డులు అం దాయి. పెద్దపెద్ద బంగళాలు ఉండి, కార్లలో తిరిగే కోటీశ్వరులు సైతం ఈ కార్డులు పొందారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు ఉంటే చర్య లు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించడంతో చాలా మంది తమ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. ఇంకా చాలా మంది అనర్హుల వద్ద ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లా యంత్రాంగంపైనే భారం అనాథలు, అత్యంత నిరుపేదలకు చెందాల్సిన అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు అనర్హుల చేతుల్లో చిక్కిన వైనం వెలుగులోకి వస్తున్నందున జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు పేదల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు వారికే చెందేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.