Susceptible
-
బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే కరోనా ముప్పు ఎక్కువ
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అంచనాలను బట్టి ఓ, బీ బడ్ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని, ఏ, ఏబీ బ్లడ్ గ్రూపులు వారికే కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని విన్నాం. కానీ తాజాగా సీఎస్ఐఆర్ నిర్వహించిన అధ్యయనంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. 'ఓ' గ్రూపు వారితో పోలిస్తే బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే వైరస్ ఎక్కువ సోకుతోందని తేలింది. ఈ గ్రూపుల వారిపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సీఎస్ఐఆర్ అధ్యయనం సీఎస్ఐఆర్ పరిశోధనా పత్రం ప్రకారం బీ, ఏబీ బ్లడ్ గ్రూపు ఉన్న ప్రజలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారే కరోనాకు ఎక్కువగా గురవుతున్నారని తెలిపింది. అలాగే ఓ గ్రూపు వారు తక్కువ సెరో-పాజిటివిటీ లేదా ప్రమాదంలో ఉన్నారని ఆగ్రాలోని పాథాలజిస్ట్ డాక్టర్ అశోక్ శర్మ వెల్లడించారు. అలాగే దేశవ్యాప్త సెరో సర్వే ప్రకారం శాఖాహారుల కంటే మాంసాహారం తినేవారికే కరోనా సంక్రమించే అవకాశం ఎక్కువ ఉందని తేల్చారు. శాఖాహారుల్లో బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. వారు తినే శాఖాహార ఆహారంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉందని అధ్యయనం పేర్కొంది. హై-ఫైబర్ ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ అని విశ్వసిస్తాం కనుక ఇది ఇన్ఫెక్షన్ అనంతర సమస్యలను నివారించడంతోపాటు, వైరస్‌నూ నిరోధిస్తోందని ఈ స్టడీ తెలిపింది. దేశవ్యాప్తంగా 10వేల మందితో నిర్వహించిన ఈ అధ్యయనంలో 140 మంది వైద్యులు కూడా ఉన్నారు. అయితే చాలామంది నిపుణులు ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. విభేదిస్తున్న కొంతమంది నిపుణులు ఓ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందనీ, అంతమాత్రాన వారు కోవిడ్-19 ప్రోటో కాల్‌కు విరుద్ధంగా పవర్తించాలని కాదని పేర్కొన్నారు. ఎందుకంటే వారికి కూడా కరోనావైరస్ సోకుతుందనే విషయాన్ని గుర్తించాలని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎస్.కె. కల్రా తెలిపారు. ఇది కేవలం "నమూనా సర్వే" అని, ఇది పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ కాదని అన్నారు. ఎందుకు వ్యత్యాసం ఉందో పూర్తిగా విశ్లేఫించకుండా, అర్థంచేసుకోకుండా, కొన్నిబ్లడ్ గ్రూపులకు మాత్రమే రోగనిరోధక శక్తి ఉందని తేల్చడం చాలా తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఓ బ్లడ్ గ్రూప్ (పాజిటివ్ లేదా నెగటివ్)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు ఏడాది అక్టోబరులో వేర్వేరుగా జరిపిన రెండు అధ్యయనాల్లో తేల్చారు. వైరస్ కారణంగాశరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం వీరిలో చాలా తక్కువని వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో 3.29 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3,876 మరణించారు. 3.56 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 82.39 శాతంగా ఉంది. అయితే మరణాల రేటు ప్రస్తుతం 1.09 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు ఇప్పటికీ 20 శాతానికి పైనే ఉండటం గమనార్హం. చదవండి: కరోనా: ప్రముఖ రచయత, నటుడు కన్నుమూత -
పోలీసుల అదుపులో దొంగబాబా
మద్నూర్: మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగ బాబా హస్తంప్రభును పోలీ సులు మంగళవారం పట్టుకున్నారు. కరీం నగర్‌కు చెందిన హ స్తం ప్రభు మండల కేంద్రంలో గల్లీలో తిరుగుతూ రోగాలు నయం చేస్తామంటూ రుక్మీణిబాయి అనే మహిళ వద్ద రెండు వేలు తీసుకొని తాయత్తులు ఇచ్చాడు. ఇలా గల్లీలో పలువురిని నుంచి వేల రూపాయలు వసూలు చేశా డు. మండల కేంద్రంలో కొన్ని రోజులుగా దొంగతనాలు ఎక్కువ కావడంతో సదరు దొంగబాబాపై స్థానికులు అనుమానం వ్యక్తం చేసి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హస్తంప్రభును ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. హస్తం ప్ర భు బతుకుదెరువు కోసం ఊర్లు తిరుగుతు అమాయక ప్రజలకు మోసం చేస్తు తాయత్తులు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఎస్సై చెప్పారు. రుక్మిణి బాయి వద్ద తీసుకున్న డబ్బులను ఎస్సై ఆమెకు తిరిగి ఇప్పించారు. మళ్లీ ఇలాంటి మోసాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించి వదిలేశారు. -
ఇప్పుడు నన్నంతా గోల్డెన్ లెగ్ అంటున్నారు!
ఒకే ఒక్క సినిమా చాలు... కెరీర్ టర్న్ కావడానికి. హంసానందిని విషయంలో అదే జరిగింది. వంశీ సినిమా ‘అనుమానాస్పదం’తో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన హంసానందినికి ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. కానీ, ‘ఈగ’లో చేసిన అతిథి పాత్ర ఆమె కెరీర్‌కి మంచి మలుపయ్యింది. ఆ తర్వాత ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్’ చిత్రాల్లో ఈ బ్యూటీ చేసిన అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘లౌక్యం’లో హంస అతిథి పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో నన్నందరూ ‘గోల్డెన్ లెగ్’ అంటున్నారని హంసా నందిని చెబుతూ -‘‘ ‘లౌక్యం’లో నా పాత్ర గురించి చెప్పి, బ్రహ్మానందంగారికి భార్యగా చేయాలని దర్శకుడు శ్రీవాస్ అన్నప్పుడు థ్రిల్ అయ్యాను. బ్రహ్మాజీ.. అదేనండీ.. బ్రహ్మానందంగారు ఎంత మంచి నటుడో తెలిసిందే. తాను నవ్వకుండా ఎదుటి వ్యక్తిని నవ్విస్తారు. ఇక, గోపీచంద్ అయితే చాలా కూల్ పర్సన్. నేను నటించిన సినిమాలను నేను పుట్టిన ఊరు పుణేలో చూస్తుంటాను. అక్కడ తెలుగువాళ్లు ఎక్కువమంది ఉన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడి చూస్తున్నారు’’ అని చెప్పారు. ప్రత్యేక పాటలు చేయడం తేలిక కాదని చెబుతూ - ‘‘నేను చేసే పాటల్లో నా లుక్, కాస్ట్యూమ్స్ అసభ్యంగా లేకుండా క్లాస్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను. అందుకే, ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ప్రతి పాట చిత్రీకరణ ముందు ఆరేడు రోజులు కసరత్తులు చేస్తాను’’ అని చెప్పారు. ‘రుద్రమదేవి’లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నానని, ఇది పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అని హంసా నందిని తెలిపారు. ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయి కథానాయిక పాత్రలొచ్చినప్పటికీ, కథలు బాగా లేకపోవడంవల్ల అంగీకరించలేదని ఆమె తెలిపారు.