పోలీసుల అదుపులో దొంగబాబా | theft baba caputure by police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో దొంగబాబా

Published Wed, Dec 10 2014 5:15 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

పోలీసుల అదుపులో దొంగబాబా - Sakshi

పోలీసుల అదుపులో దొంగబాబా

మద్నూర్: మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగ బాబా హస్తంప్రభును పోలీ సులు మంగళవారం పట్టుకున్నారు. కరీం నగర్‌కు చెందిన హ స్తం ప్రభు మండల కేంద్రంలో గల్లీలో తిరుగుతూ రోగాలు నయం చేస్తామంటూ రుక్మీణిబాయి అనే మహిళ వద్ద రెండు వేలు తీసుకొని తాయత్తులు ఇచ్చాడు. ఇలా గల్లీలో పలువురిని నుంచి వేల రూపాయలు వసూలు చేశా డు.  

మండల కేంద్రంలో కొన్ని రోజులుగా దొంగతనాలు ఎక్కువ కావడంతో సదరు దొంగబాబాపై స్థానికులు అనుమానం వ్యక్తం చేసి,  పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హస్తంప్రభును ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి  పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.  హస్తం ప్ర భు బతుకుదెరువు కోసం ఊర్లు తిరుగుతు అమాయక ప్రజలకు మోసం చేస్తు తాయత్తులు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఎస్సై చెప్పారు. రుక్మిణి బాయి వద్ద  తీసుకున్న డబ్బులను ఎస్సై ఆమెకు తిరిగి ఇప్పించారు. మళ్లీ ఇలాంటి మోసాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించి వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement