suspension petititon
-
రోజా సస్పెన్షన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వ అప్పీల్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున పీపీ రావు తమ వాదనలు వినిపించారు. ఇక ఎమ్మెల్యే రోజా పిటిషన్‌పై ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. 'ఈ కేసులో కక్షిదారు అసెంబ్లీ మాత్రమే. కానీ ఇక్కవ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వచ్చారు. శాసనసభ చేసిన అప్పీల్ మాత్రమే ఇక్కడ వర్తిస్తుంది. అసెంబ్లీ అప్పీల్‌కు రాలేదు కాబట్టి, మధ్యంతర ఉత్తర్వులు అమలుకు అభ్యంతరం లేదనే అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ ఉద్యోగులు ఒక పక్షం వహించరు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు ...ఉద్యోగులకు సమానమే. అలాంటప్పుడు వారు ఎలా అప్పీల్‌కు వస్తారు. అసెంబ్లీ కార్యదర్శి ఈ కేసులో రెండో రెస్పాండెంట్. 340 నిబంధన కిందే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ విధించారు. రోజాను సస్పెండ్ చేసింది సభ కాబట్టి..ఇప్పుడు దాన్ని తొలగించాల్సింది కూడా సభే నని' అసెంబ్లీ నియామావళిలోని నిబంధనలు ఇందిరా జైసింగ్ ఈ సందర్భంగా చదివి వినిపించారు. ఒకవేళ194 కిందే చర్య తీసుకున్నారనుకుంటే ముందుగా నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఇందిరా జైసింగ్ ప్రశ్నించారు. 340 కిందే ఎమ్మెల్యే రోజాపై చర్య తీసుకున్నారని స్పష్టమవుతుందన్నారు. సభ పొరపాటు చేసిందని, ప్రభుత్వం వచ్చి కోర్టుకు చెబుతోందని, ఆ పొరపాటును సభే సరిదిద్దుకోవాలని రోజా తరఫు న్యాయవాది తన వాదనలు గట్టిగా వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. -
రోజా సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ మొదలైంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా రాష్ట్ర ముఖ్య మంత్రిని ఉద్దేశించి అనుచితంగా నినాదాలిచ్చారంటూ తెలిపారు. మరో వైపు రోజా తరఫు న్యాయవాది.. ప్రభుత్వ వాదనలను తొసిపుచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో.. రికార్డుల్లో లేదని తెలిపారు. ఆ నాటి ఘటనకు సంబంధించిన రికార్డులు సైతం తమకు ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ అఫిడవిట్ లో కూడా రోజా వ్యాఖ్యలప్రస్తావన లేదని గుర్తు చేశారు. కాగా.. రిట్ పిటిషన్ పై తీర్పు మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే రోజాకు ఊరట
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె పిటిషన్‌ను విచారించాలంటూ ఉన్నత ధర్మాసనం మంగళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా హైకోర్టులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బుధవారం ఉదయం ఎమ్మెల్యే రోజా పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆదేశాలను ఈ-మెయిల్లో హైకోర్టుకు పంపుతామని జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కాగా రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ కోడెల శివప్రసారావు మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని ఆమె పిటిషన్లో కోరారు. అయితే రోజా సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రోజా పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఏడాదిపాటు తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని పేర్కొంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని శుక్రవారం విచారణకు చేపట్టిన జస్టిస్ జగదీశ్ కెహర్ మరో బెంచ్‌కు బదిలీ చేయాలని సూచించారు. దీంతో సోమవారం మరోసారి కేసును రోజా తరుపు న్యాయవాది ప్రస్తావించనున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు.