రోజా సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్కు సంబంధించి హైకోర్టులో విచారణ మొదలైంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్‌సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా రాష్ట్ర ముఖ్య మంత్రిని ఉద్దేశించి అనుచితంగా నినాదాలిచ్చారంటూ తెలిపారు.
మరో వైపు రోజా తరఫు న్యాయవాది.. ప్రభుత్వ వాదనలను తొసిపుచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో.. రికార్డుల్లో లేదని తెలిపారు. ఆ నాటి ఘటనకు సంబంధించిన రికార్డులు సైతం తమకు ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ అఫిడవిట్ లో కూడా రోజా వ్యాఖ్యలప్రస్తావన లేదని గుర్తు చేశారు. కాగా.. రిట్ పిటిషన్ పై తీర్పు మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్‌సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు.