suspious death
-
బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లాలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన ఎం.విజయ్కుమార్ కుమార్తె రోహిత (21) విజయవాడ కానూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె సోమవారం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తనకు ఏడాదిగా పరిచయమున్న అదే కళాశాలకు చెందిన విద్యార్థితో మనస్పర్థలు వచ్చాయని, తనతో అతను మాట్లాడటం లేదని ఆవేదన చెందింది. దిగులు పడవద్దని తాము వచ్చి మాట్లాడతామని తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నా ఆమె తీయలేదు. దీంతో అనుమానంతో కుటుంబసభ్యుల్లో ఒకరు మంగళవారం రాత్రి హాస్టల్కు వచ్చి రోహిత గదిని చూడగా అక్కడ ఆమె ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు చాట్రాయి నుంచి కానూరు వచ్చారు. హాస్టల్ గదిలో రోహిత మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తూ బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా' -
‘నా కూతురిని పొట్టనపెట్టుకున్నారు’
సాక్షి, పెద్దపల్లి : ‘నా కూతురు మానసను అత్తింటివారే హత్యచేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని’ఇటీవల అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన తిప్పర్తి మానస తల్లి మంజుల మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావుతో బుధవారం మొరపెట్టుకుంది. మానస అత్తింటి వారిని చట్టరీత్యా శిక్షించాలని తన కూతురు చావుకు కారణమైన అత్త మామ, ఆడపడుచులను అరెస్టు చేసి న్యాయం చేయాలని వినతిప్రతం సమర్పించింది. పెగడపల్లి గ్రామానికి చెందిన మూల మల్లారెడ్డి మంజుల పెద్దకూతురు మానసను 8ఇంక్లైన్ కాలనీలోని తిప్పర్తి లక్ష్మారెడ్డి పుష్పలత రెండో కుమారుడు సతీష్రెడ్డితో 2018వ సంవత్సరం జూలై ఆరో తేదీన వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారం ముట్టజెప్పారు. బాబు పుట్టినప్పటి నుంచి అదనంగా మరో రూ.20 లక్షలు అదనపు కట్నం కావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేశారు. ఇటీవల పెగడపల్లి గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. మానసను బాగా చూసుకుంటామని నమ్మించి కాపురానికి తీసుకెళ్లారు. ఈ నెల 10వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకకు 8ఇంక్లైన్కు రమ్మని మానస పుట్టింటి వారికి కబురు చేశారు. పథకం ప్రకారం మానసను ఒక రోజు ముందే ఈనెల 9వ తేదీన 8ఇంక్లైన్ కాలనీలోని క్వార్టరు నంబరు టి2–151లో ఉరివేసి చంపి ఆత్మహత్య చేసుకుందని డ్రామాకు తెరదించారన్నారు. అత్త పుష్పలత, మామ లక్ష్మారెడ్డి, ఆడపడుచు రజితను చట్టరీత్యా శిక్షించి న్యాయం చేయాలని రేవతిరావుకు మానస తల్లి మంజుల మొరపెట్టుకుంది. బాధిత కుటుంబాన్ని రేవతిరావు ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తనకు ఫోన్ చేయాలని 99493 31939 నంబర్ ఇచ్చారు. తొలిసారిగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి వచ్చిన రేవతిరావును గ్రామస్తులు సన్మానించారు. ఆమె వెంట ఎంపీపీ సంపత్, జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ నిర్మల, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. -
ఒకే ఇంట్లో నలుగురి అనుమానాస్పద మృతి
-
చిన్నారి అనుమానాస్పద మృతి
నెల్లూరు : నగరంలోని గుర్రాలమడుగు సంఘానికి చెందిన మహమ్మద్ అన్సారి, ప్రత్యూష కుమార్తె అర్షియా (6) మంగళవారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. అయితే తండ్రే ఆ చిన్నారిని హత్య చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘటన అనంతరం తండ్రి అన్సారి పరారీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. మహమ్మద్ అన్సారి, ప్రత్యూష ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నారు. ప్రత్యూష ఆడపిల్లకు జన్మనివ్వడంతో భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. అయితే ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. ఈక్రమంలో మంగళవారం ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. ఉదయం చిన్నారికి తల్లి స్నానం చేయించి నిద్రపుచ్చింది. కొద్దిసేపటికే ఆ చిన్నారి చలనం లేకుండా ఉండటంతో అనుమానం వచ్చిన ప్రత్యూష చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. ఈ సంఘటన అనంతరం అన్సారి ఇంట్లో నుంచి పరారయ్యాడు. దీన్ని బట్టి ఆ చిన్నారిని తండ్రే హతమార్చి పరారయ్యాడని ప్రత్యూషాతో పాటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలిక మృతి... పోలీసుల అదుపులో తండ్రి
విశాఖపట్టణం: ఓ బాలిక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం విశాఖపట్టణం జిల్లా మునగపాక మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మునగపాక ప్రభుత్వ హైస్కూల్లో 9 వతరగతి చదువుతున్న బాలిక శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి మృతి చెందింది. ఈ విషయాన్ని అప్పుడే కూలి పనికి వెళ్లి వచ్చిన తల్లి గమనించింది. బాలిక మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిని తల్లి ఆ విషయాన్ని బాలిక అంత్యక్రియల తర్వాత వెల్లడించింది. అలాగే బాలిక చనిపోయిన సమయంలో తన భర్త ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్నాడని తెలిపింది. కూతురిని భర్త తరచూ వేధిస్తూ ఉండేవాడని పేర్కొంది. దీంతో తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.