బాలిక మృతి... పోలీసుల అదుపులో తండ్రి | girl suspious death | Sakshi
Sakshi News home page

బాలిక మృతి... పోలీసుల అదుపులో తండ్రి

Published Sat, Mar 7 2015 9:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

girl suspious death

విశాఖపట్టణం: ఓ బాలిక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం విశాఖపట్టణం జిల్లా మునగపాక మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మునగపాక ప్రభుత్వ హైస్కూల్‌లో 9 వతరగతి చదువుతున్న బాలిక శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి మృతి చెందింది. ఈ విషయాన్ని అప్పుడే కూలి పనికి వెళ్లి వచ్చిన తల్లి గమనించింది.

 

బాలిక మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిని తల్లి ఆ విషయాన్ని బాలిక అంత్యక్రియల తర్వాత వెల్లడించింది. అలాగే బాలిక చనిపోయిన సమయంలో తన భర్త ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్నాడని తెలిపింది. కూతురిని భర్త తరచూ వేధిస్తూ ఉండేవాడని పేర్కొంది. దీంతో తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement