SUV Vitara Brezza
-
మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020 లోకొత్త విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి లాంచ్ చేసింది. దేశంలో అమలు కానున్న ఉద్గార నిబంధనలు నేపథ్యంలో బీఎస్-6 1.5 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజీన్‌తో గురువారం ఆవిష్కరించింది. సరికొత్త వెర్షన్లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీలలో విటారా బ్రెజ్జా ఉన్నతంగా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా సీఎండీ కెనిచి ఆయుకావా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ, ప్రీమియంలో వస్తున్న ఆదరణకు తగినట్టుగా, విటారా బ్రెజ్జా మరింత స్పోర్టియర్‌గా మరింత శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల నుంచి భారీ స్పందనను ఆశిస్తున్నట్టు తెలిపారు. విటారా బ్రెజ్జా 1.5 లీటర్ కె-సిరీస్ బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 138 ఎన్ఎం వద్ద 4400 ఆర్పీయం టాప్ ఎండ్ టార్క్, పెప్పీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో లాంచ్ చేసిన విటారా బ్రెజ్జా వాహనం నాలుగేళ్లలో 500,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని వెల్లడించింది. చదవండి : ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ అదరగొడుతున్న పియాజియో స్కూటీలు -
దూసుకుపోతున్నమారుతి బ్రెజ్జా
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ....కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజ్జా అమ్మకాల్లో దూసుకుపోతోంది. అర్బన్ కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజ్జా దేశీయ మార్కెట్లో లక్ష సంచిత అమ్మకాలు మైలురాయిని అధిగమించిందని మారుతి ప్రకటించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే రూపొందించిన బ్రెజ్జా రికార్డ్ క్యుములేటివ్ సేల్స్ తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మారుతి సుజుకి గొప్ప పేరుతెచ్చిన వాహనం బ్రెజ్జా అని , వినియోగదారులు ఒక కాంపాక్ట్ ఎస్యూవీ నుండి ఆశించే అన్ని పారామీటర్స్ కలిగిఉందని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్ మరియు సేల్స్ ఆర్ఎస్ కల్సి ఒక ప్రకటనలో తెలిపారు. 2017 అక్టోబర్ తరువాత భారతదేశంలో మొట్టమొదటి కారుగా నిలవనుందని పేర్కొన్నారు. స్పోర్టి అండ్ గ్లామర్స్ లుక్స్ తో, మంచి ఇంధన సామర్థ్యంతో గత ఏడాది మార్చిలో లాంచ్ అయిన విటారా బ్రెజ్జా.. కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో సంచలనం సృష్టించింది. లాంచ్ అయిన కేవలం 11 నెలల కాలంలోనే సుమారు రెండు లక్షల కంటే ఎక్కువ బుకింగ్‌లను సాధించింది. 1.3 లీటర్ల డీడీఐఎస్ డిజిల్ ఇంజిన్, 88.5 బీహెచ్పీ పవర్‌తో 190ఎన్ఎం టార్క్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్, డిజల్ లీటరుకు 24.3 కిలోమీటర్ల మైలేజీ బ్రెజ్జా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.