suvra mukherjee
-
శుభ్రా ముఖర్జీకి అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీకి బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు లోధీ రోడ్డులోని విద్యుత్ దహనవాటికలో జరిగాయి. 13, తల్కటోరా రోడ్డులోని కుమారుడు అభిజిత్ నివాసం నుంచి భౌతికకాయాన్ని దహనవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తదితరులు హాజరయ్యారు. చితాభస్మాన్ని ఆమె కుటుంబసభ్యులు హరిద్వార్‌కు తీసుకెళ్లి గంగానదిలో కలిపారు. శుభ్రా శ్వాససంబంధ వ్యాధితో మంగళవారం మృతిచెందడం తెలిసిందే. బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం ఢాకా నుంచి వచ్చి ప్రణబ్‌ను పరామర్శించారు. శుభ్రాముఖర్జీ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. 1975లో బంగ్లా స్వతంత్ర పోరాట సమయంలో దేశ బహిష్కారానికి గురైనప్పుడు భారత్‌లో తలదాచుకున్న హసీనాకు ప్రణబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. శుభ్రా అంత్యక్రియలు పూర్తయిన కాసేపటి తర్వాత ప్రణబ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని తిరిగి అధికార విధులు ప్రారంభించారు. -
శుభ్రా ముఖర్జీ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ ప్రధాని
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి వికాస్ స్వరూప్ అధికారికంగా వెల్లడించారు. శుభ్రా ముఖర్జీకి నివాళులు అర్పించేందుకు షేక్ హసీనా భారత్ వచ్చినట్లు. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రధానిని సాదరంగా రిసీవ్ చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్టులో సుష్మా స్వరాజ్, షేక్ హసీనా కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. కాగా శుభ్రా ముఖర్జీ మృతి సందర్భంగా షేక్ హసీనా నిన్న ప్రణబ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. శుభ్రా అంత్యక్రియలకు షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా హాజరయ్యారు. శుభ్రా వారికి దగ్గరి స్నేహితురాలు. అనారోగ్యంతో శుభ్రా ముఖర్జీ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. -
శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభ్రా ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ వారం రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూత