swachh andhra
-
స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్గా తుర్లపాటి
విజయవాడ కల్చరల్: స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్గా విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు, కాలమిస్ట్ తుర్లపాటి కుటుంబరావు నియమితులయ్యారు. ఈ మేరకు స్వచ్ఛంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ బి.మురళీధరరెడ్డి నుంచి మంగళవారం లేఖ అందిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తుర్లపాటి 70 ఏళ్లుగా పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. అనేక పత్రికలకు వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా తెలుగు భాషాభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేశారు. తుర్లపాటిని స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై పలు కళా, సాంస్కృతిక సంస్థలు ఆయనకు అభినందనలు తెలియజేశాయి. -
110 పట్టణాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు
అరండల్పేట(గుంటూరు): రాష్ట్రంలోని 110 పట్టణాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ముఖ్య నగరాల్లో భూగర్భ డ్రైనేజీ పనులను సైతం అభివృద్ధి చేస్తామన్నారు. శుక్రవారం గుంటూరులోని సుద్ధపల్లి డొంకలోని సీవరేజ్ ట్రీట్మెంట్ప్లాంట్ను పరిశీలించిన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సాలిడ్వేస్ట్మేనేజ్మెంట్, లిక్విడ్వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.