Swami viveka nanda
-
యువత చేతుల్లో దేశ భవిష్యత్: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని భారతదేశ యువత శాసిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విశాఖ నగరంలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, వైఎస్సార్సీపీ నేతలు కోలా గురువులు, కేకే రాజు, మళ్ల విజయ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని ఎప్పుడో వివేకానంద చెప్పారన్నారు. యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని మంత్రి అవంతి పేర్కొన్నారు. (చదవండి: దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ) (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) -
యువతకు రోల్ మోడల్ ఆయన..
భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన మొఖం , గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశ భక్తికి నిలువెత్తు రూపం ..ఆయనే స్వామి వివేకానంద .కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. యువతకు రోల్ మోడల్. స్పూర్తి సందేశాలతో మంత్రముగ్దులను చెయ్యగలిగే గొప్ప వక్త. కేవలం ముప్పై తొమ్మిది సంవత్పరాలు మాత్రమే ఈ భూమ్మీద నడయాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా, స్పూర్తిప్రదాతగా వెలుగొందుతున్నారు. అందుకే ఆయన పుట్టినరోజైన జనవరి 12 ను నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు. -
అపూర్వం.. అపురూపం!
కీసర, న్యూస్‌లైన్: అపూర్వ రీతిలో 150 మంది విద్యార్థులు స్వామి వివేకానంద వేషధారణలతో అపురూపంగా నిలిచారు. యువతకు వివేకాందుడు మార్గదర్శి అని, ఆయన బోధనలు అందరూ పాటించాలని వక్తలు సూచించారు. ఆదివారం శ్రీ వివేకానంద సెరినిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని చీర్యాల చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో చీర్యాల సెరినిటీ పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులు వివేకానందుడి వేషధారణలో మానవ హారం నిర్వహించారు. సెరినిటీ పాఠశాల నుంచి విద్యార్థులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. వివేకానంద వేషధారణలో విద్యార్థులు ర్యాలీగా నగరంలోని రామకృష్ణమఠం వరకు వెళ్లారు. విద్యార్థులు నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కీసర వెంకటసాయి థియేటర్లో ‘స్వామి వివేకానంద- ది యూత్ ఐకాన్’ డాక్యుమెంటరీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ దర్శకుడు సురేష్ బుజ్జి మాట్లాడుతూ.. వివేకానందుడి ఆదర్శాలు, ఆశయాలు నేటి తరానికి కొంతమేరకైనా అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. డాక్యుమెంటరీలో సెరినిటీ పాఠశాలకు చెందిన 150 విద్యార్థులు నటించారని ఆయన చెప్పారు. చిత్ర దర్శకుడిని, నిర్మాత జీఆర్ రెడ్డిని చీర్యాల దేవాలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముప్పురాంరెడ్డి, చీర్యాల సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ తదితరులు సత్కరించారు. అనంతరం చీర్యాల చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడవాలని, దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మేడ్చల్ ఇన్చార్జి నక్కా ప్రభాకర్ గౌడ్, బీజేపీ నేత కొంపల్లి మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు నానునాయక్, ఖలీల్, అనిల్, బచ్పన్ స్కూల్స్ రాష్ట్ర డెరైక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వివేకానందునిపై తొలి తెలుగు సినిమా
ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతరం మనకు కావాలనీ, ఆరోగ్యమే మహాభాగ్యమని జగత్తుకు చాటి, భారతీయత గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు తెలిసొచ్చేట్టు చేసిన గొప్ప తత్వవేత్త వివేకానందుడు. ఆయన జీవితం ఆధారంగా తెలుగుతెరపై ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ రూపొందిన చిత్రం ‘స్వామి వివేకానంద’. వివేకానందునిగా ప్రముఖ రాజకీయ నాయకుడు కీ.శే. పీజేఆర్ మనవడు ప్రభాత్ నటించారు. సురేష్ బుజ్జి కేవీఎస్ దర్శకుడు. జి.ఆర్.రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. మా చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి, తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రశంసించిన సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. త్వరలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ చిత్రానికి: కథ, మాటలు: రమేశ్రాయ్, కూర్పు: నందమూరి హరి, కళ: కెవీ రమణ, నిర్మాణం: లక్ష్మీ గణేశ ఫిలిమ్స్-శ్రీఇంద్రచిత్ర.