వివేకానందునిపై తొలి తెలుగు సినిమా
వివేకానందునిపై తొలి తెలుగు సినిమా
Published Sat, Nov 30 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతరం మనకు కావాలనీ, ఆరోగ్యమే మహాభాగ్యమని జగత్తుకు చాటి, భారతీయత గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు తెలిసొచ్చేట్టు చేసిన గొప్ప తత్వవేత్త వివేకానందుడు. ఆయన జీవితం ఆధారంగా తెలుగుతెరపై ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ రూపొందిన చిత్రం ‘స్వామి వివేకానంద’. వివేకానందునిగా ప్రముఖ రాజకీయ నాయకుడు కీ.శే. పీజేఆర్ మనవడు ప్రభాత్ నటించారు.
సురేష్ బుజ్జి కేవీఎస్ దర్శకుడు. జి.ఆర్.రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. మా చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి, తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రశంసించిన సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. త్వరలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ చిత్రానికి: కథ, మాటలు: రమేశ్‌రాయ్, కూర్పు: నందమూరి హరి, కళ: కెవీ రమణ, నిర్మాణం: లక్ష్మీ గణేశ ఫిలిమ్స్-శ్రీఇంద్రచిత్ర.
Advertisement