Swapna Barman
-
నేనేంటో నాకు తెలుసు.. వదిలిపెట్టను: స్వప్నాకు నందిని అగసార కౌంటర్
స్వప్నా బర్మన్ చేసిన సంచలన ఆరోపణలను భారత అథ్లెట్ నందిని అగసార ఖండించింది. తన విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చింది. తానేంటో తనకు తెలుసునని.. ఒకవేళ స్వప్నా దగ్గర తనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరింది. కాగా ఆసియా క్రీడలు-2023లో తెలంగాణకు చెందిన నందిని అగసార హెప్లథ్టాన్ విభాగంలో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చైనాలోని హోంగ్జూలో ఏడు క్రీడాంశాలతో కూడిన హెప్టథ్టాన్లో సత్తా చాటి మెడల్ సాధించింది. ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ట్రాన్స్‌జెండర్ వల్ల తాను కాంస్యం కోల్పోయానంటూ సంచలన పోస్టుతో నందినిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓటమిని తట్టుకోలేని ఆమె విద్వేషంతో ఈ మేరకు చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. నందినిని తక్కువ చేసేలా మాట్లాడిన స్వప్నా బర్మన్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందించిన నందిని అగసార స్వప్నాకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ‘‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర నాకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. నేను కూడా నా దగ్గర దేశం కోసం గెలిచిన ఈ మెడల్‌ను చూపిస్తాను. దేశం కోసం ఆడాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడు మేము గెలిచాం. మా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయనుకుంటా. ఈ విషయాన్ని నేను భారత అథ్లెటిక్స్ సమాఖ్య దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతం నేను పతకం సాధించానన్న ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఇండియాకు వెళ్లిపోతున్నాను’’ అని నందిని అగసార పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా తెలంగాణకు చెందిన 20 ఏళ్ల నందిని మహిళల హెప్లథ్టాన్ విభాగంలో 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. మరోవైపు స్వప్నా బర్మన్కు ఈ ఈవెంట్లో 5708 పాయింట్లు మాత్రమే వచ్చాయి. చదవండి: కోహ్లికి నో ఛాన్స్! మరో టీమిండియా స్టార్‌కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్: బట్లర్ #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
భారత అథ్లెట్ నందినిపై విషం చిమ్మిన స్వప్నా.. ట్రాన్స్‌జెండర్ అంటూ తీవ్ర ఆరోపణలు
భారత అథ్లెట్ స్వప్నా బర్మన్ తోటి క్రీడాకారిణి అగసార నందినిపై విషం చిమ్మింది. ఆసియా క్రీడలు-2023లో ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తెలంగాణ అమ్మాయి నందినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నందినిని ట్రాన్స్‌జెండర్‌గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన స్వప్నా వెంటనే దానిని డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో స్వప్నా తీరుపై భారత క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ప్లేయర్‌పై విద్వేషపూరిత కామెంట్లు చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. కాగా చైనా వేదికగా హోంగ్జూలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో నందిని కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో 5712 పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా బ్రాంజ్ మెడల్ సాధించి ఆసియా క్రీడల్లో సత్తా చాటింది. అయితే, ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో వెనుదిరగింది. గత ఎడిషన్‌లో పసిడి పతకం సాధించిన స్వప్నా ఈసారి ఘోర ఓటమి నేపథ్యంలో నందిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. Now this is Shocking! Swapna Barman, who finished 4th in Heptathlon yesterday, saying that compatriot Nandini, who won Bronze medal, is a transgender and that this is against the rules of Athletics! https://t.co/ST6Th0mAc9 — India_AllSports (@India_AllSports) October 2, 2023 ‘‘చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడల్లో భాగంగా నేను నా కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ వుమెన్‌కు చేజార్చుకున్నాను. నా మెడల్ నాకు కావాలి. నాకు ఎవరైనా సాయం చేయండి. అథ్లెటిక్స్‌లో ఇలాంటి వాళ్లు పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధం’’ అంటూ ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వెంటనే ఆ పోస్ట్‌ను స్వప్నా డిలీట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్‌గా మారాయి. కాగా స్వప్నా బర్మన్ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ వచ్చిందా లేదంటే ఆమె అకౌంట్ నుంచి వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా నందినిపై ఆరోపణలు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వరల్డ్ అథ్లెటిక్స్ రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం.. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళా వరల్డ్ ర్యాంకింగ్స్ ఈవెంట్లలో పాల్గొనడానికి వీల్లేదు. మార్చి 31 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కాగా స్వప్నా ఇటీవల బ్రిడ్జ్‌తో మాట్లాడుతూ.. ‘‘టెస్టోస్టిరాన్ లెవల్స్ 2.5 కంటే ఎక్కువగా ఉన్నవాళ్లు 200 మీ. మించి ఏ ఇతర ఈవెంట్లలో పాల్గొనకూడదు. ఏ అమ్మాయైనా సరే.. త్వరగా హెప్టాథ్లాన్ ఈవెంట్‌ను పూర్తి చేయలేదు. నేనైతే 13 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న తర్వాతే ఇక్కడిదాకా వచ్చాను. కానీ ఆమె నాలుగు నెలల శిక్షణలోనే ఈ స్థాయికి ఎలా చేరుకుందో’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్‌పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం), 800 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటిన అగసార నందిని కాంస్యం కైవసం చేసుకున్న నేపథ్యంలో స్వప్నా బర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 🎽𝗔 𝗖𝗢𝗡𝗧𝗥𝗢𝗩𝗘𝗥𝗦𝗬 𝗨𝗡𝗙𝗢𝗟𝗗𝗜𝗡𝗚! Swapna Barman, who finished fourth in the Heptathlon, has alleged that her fellow Indian and Bronze winner Nandini Agasara is transgender and contends that this gives her an unfair advantage in competing in the women's event. 🥉… pic.twitter.com/CsM5sJVF8I — Team India at the Asian Games 🇮🇳 (@sportwalkmedia) October 2, 2023 -
నిశ్శబ్ద విప్లవ వీరులు
మనం తెల్లారిలేస్తే రాబ్రీ దేవి, ఆమె ముద్దుల తనయుడు తేజస్వీ యాదవ్ జైలుకి వెళ్తారా లేదా? విజయ్ మాల్యాని మన దేశానికి ఎప్పుడు తీసుకు వస్తారు. – ఇలాంటి ఆలోచ నలతో సతమతమవుతూ ఉంటాం. ఇవి మనకి సంబం ధించిన, మన జీవితాలను ప్రభావితం చేసే సమస్యలు కావు. అయినా ఆలోచించడం మనల్ని కృంగదీసే వ్యస నం. కానీ మరొకపక్క నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. కొత్త యోధులు– ప్రమేయం లేని వీరులు ఈ సమా జాన్ని, దేశాన్నీ ప్రభావితం చెయ్యబోతున్నారు. ఆ అమ్మాయి – స్వప్నా బర్మన్ – రెండు కాళ్లకీ ఆరేసి వేళ్లు. బెంగాలులో అతిపేద కుటుంబంలో పుట్టింది. ఆ పిల్ల తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి తేయాకు తోటల్లో రోజుకూలీ. వాళ్లు ఒక రేకుల షెడ్డులో బతుకుతారు. దైనందిన జీవినమే వారి సమస్య. కానీ ఫొటోలో ఆ పిల్ల నవ్వు – దైనందిన సమస్యల్ని లెక్కచేయని, ఆకాశంలోకి మోర సారించే ఓ యోధురాలి ‘విశ్వాసా’నికి ప్రతీక. మొన్నటి ఆసియా క్రీడల పోటీలలో– హెప్ల థాన్ అనే క్రీడ ఒకటుంది. ఇది కొన్ని రకాల క్రీడల సమగ్ర రూపం– 100 మీటర్ల హార్డిల్స్, హైజంప్, ఇనుప గోళాన్ని విసిరే ‘షాట్ పుట్’, లాంగ్ జంప్, జావలిన్, 800 మీటర్ల హార్డిల్స్– ఇలాగ. వీటన్నిం టినీ కలిపితే– హెప్లథాన్. క్రీడ అన్నివిధాలా కడుపు నిండిన వ్యక్తి వినోదం. కానీ బయటి ప్రపంచపు వికారాలకు దూరంగా, పేదరికంలో, శారీరక అవలక్షణా లతో మగ్గే ఓ అమ్మాయి కాలివేళ్లతో సరైన జోళ్లు లేక నరకయాతన పడుతోంది. మంచి జోళ్లు కొనుక్కునే ఆస్కారం లేదు. అవకాశం లేదు. అయినా ఈ ప్రతికూల లక్షణాలతో, పగిలిన దవడకి బాండేజీతో ఈ క్రీడమీద ఆధిపత్యాన్ని సాధించింది. దేశీయ స్థాయిలో ఆ క్రీడలో పాల్గొని ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాన్ని సాధించి– ఈ దేశ పతాకాన్ని అంతర్జాతీయంగా ఎగురవేసింది. ఆమె చిరు నవ్వులో పేదరికం లేదు. ఆకలి లేదు. అవసరాలు లేవు. ప్రపంచాన్ని జయించే విజయోత్సాహం ఉంది. ఈ విజయం తర్వాత దేశం మేలుకొంది. ఆమె కాళ్లకు సరిపోయే జోళ్లను తయారు చేయించి ఇవ్వడానికి తమిళనాడులో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు వచ్చింది. మన వర్తమానాన్ని గజిబిజి చేసే కుళ్లు నాయ కత్వంతో తలమునకలవుతున్న ఈనాటి వ్యవస్థలో సాహసాన్నీ, ఆశనీ, విశ్వాసాన్నీ నింపే గొప్ప యోధులు వీరు. ఇంకా కింది దశలకు వెళ్తాను. 15 ఏళ్ల కిందటి కథ. మా ఇంట్లో ఓ వంట మనిషి. భర్త తాగుబోతు. ఇద్దరు ఆడపిల్లలు. తాగుబోతు భర్తని దూరంగా తగిలేసింది. ఈ ఇంటికి వంటకి వచ్చినప్పుడు– ఏడె నిమిదేళ్ల ఈ ఇద్దరు పిల్లల్నీ అల్లరి చెయ్యకుండా– ఇంటి బయట గోడ దగ్గర కూర్చోపెట్టేది. వారికి వారి పేదరికం తెలుసు. తమ పరిమితి తెలుసు. బుద్ధిగా కూర్చొనేవారు. మా ఆవిడ ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తినేవారు. మా మనుమ రాళ్ల బట్టలు ఇస్తే వేసుకునే వారు. పలకరిస్తే పలికే వారు. లేకపోతే కుంచించుకపోయి– తమ ఉనికి మరొకరిని బాధించకుండా ఆ గోడకి ఒదిగిపోయేవారు. తల్లి పని పూర్తయ్యాక– నిశ్శబ్దంగా చెయ్యి పుచ్చుకు నడిచిపోయేవారు. ఏమవుతారు ఈ పిల్లలు? చదువుకుంటారా? వీళ్లూ వంటలు చేస్తారా? అది హీనమైన పనేం కాదు. అయినా రెండో తరానికి వార సత్వంగా ఇచ్చే పనేనా? ఎప్పుడైనా మనస్సులో కదిలేది. 15 ఏళ్ల తరువాత వీళ్లిద్దరూ పోస్టు గ్రాడ్యు యేట్లయ్యారు. బియ్యే తరువాత కాలేజీ వీళ్లని పిలిచి స్కాలర్‌షిప్పు లిచ్చింది. 40 ఏళ్ల కిందటిమాట. మరొక పేద ఇల్లాలు. ఒక మహా కర్ణాటక విద్వాంసుని దూరపు బంధువు. మేం మద్రాసులో ఉన్న రోజుల్లో మా ఇంటికి వచ్చేది. మా ఆవిడకి వంటలో తోడుగా నిలిచేది. జీతానికి కాదు. బియ్యం నూకలు ఇస్తే కొంగున కట్టుకువెళ్లి పిల్లలకు వండిపెట్టేది. ఒక్కోసారి అక్షింతలు పోగుచేసి, కడిగి వండి– అందరికీ వేర్వేరుగా వడ్డిస్తే సరిపోదని ఒక కంచంలో అన్నం కలిపి పిల్లల నోటికి అందించేది. ఆ పిల్లలు సౌందర్యవంతులు. తర్వాతి కాలంలో ఓ పారి శ్రామికవేత్త ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి మేం వెళ్లాం. ఇప్పుడామె కోటీశ్వరురాలు. కుర్రాడు పెన్నుల కంపెనీలో ఆఫీసరు. ఎప్పుడూ ఓ పెన్నుల పార్శిలు పట్టుకుని నన్ను కలుస్తాడు– ‘మీరు మాకు అన్నం పెట్టారు మామయ్యగారూ’ అంటూ. పేదరికం రెండో పార్శ్వమిది. ఒకరు ఆత్మ గౌర వంతో మంచి జీతానికి నిచ్చెనలు వేస్తూ సమా జాన్ని ఆరోగ్యవంతంగా నిలుపుతున్నారు. మరొకరు దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతున్నారు. వీరు ఉల్ఫా నాయ కులు కారు. ఇది దేశాన్ని కొల్లగొట్టే అవకాశవాదుల కథ కాదు. స్వప్నా బర్మన్ కథ ఈ దేశానికి విజయపతాక. కళ్లు మిరుమిట్లు గొలిపే నిశ్శబ్ద విప్లవానికి సంకేతం. బంగారు కాంతులతో మెరిసే తూర్పు. గొల్లపూడి మారుతీరావు -
క్రికెటర్ల కన్నా వారే రియల్ హీరోలు: గంభీర్
న్యూఢిల్లీ : క్రికెటర్ల కన్నా ఇతర ఆటగాళ్లే రియల్ హీరోలని టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఏ మాత్రం పేరు, డబ్బులు రాకున్నా క్రికెటేతర ఆటగాళ్లు ఎన్నో సమస్యల మధ్య విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతాకాన్ని రెపరెపలాడించి అథ్లెట్స్ రియల్ హీరోలు అని అభివర్ణించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘క్రికెటేతర ఆటగాళ్లు ఆర్థికంగా, సౌకర్యాల పరంగా చాలా ఇబ్బంది పడుతారు. కానీ పతకాలు సాధించకపోతే ప్రజలు వారిని అసలు గుర్తించడం లేదు. ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. 69 పతకాలతో చరిత్ర సృష్టించారు. కానీ భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదు. క్రికెటరేతర ఆటగాళ్లకు అన్ని ప్రతికూల అంశాలే. స్వప్న బర్మను చూస్తే రియల్ హీరోలు ఎవరో తెలుస్తోంది. నన్ను ఎవరైన ప్రశ్నిస్తే క్రికెటర్ల కన్నా వారే గొప్పవారని చెబుతా. క్రికెటర్లే కాకుండా దేశం తరపున ఇతర ఆటగాళ్లు సైతం రాణిస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందించాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆ ‘స్వప్నం’ వెనుక ది వాల్ -
ఆ ‘స్వప్నం’ వెనుక రాహుల్ ద్రవిడ్
కోల్‌కతా: స్వప్న బర్మన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఏషియన్ గేమ్స్ ముందు వరకు అసలు ఈమె ఎవరో కూడా తెలియదు. కానీ ఈ టోర్నీలో భారత్ 68 ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ హెప్టథ్లాన్ విభాగంలో తొలిసారి స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది ఈ బెంగాల్ అమ్మాయి. అప్పటి నుంచి ఈ అథ్లెట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు ఆమె ప్రతిభను కొనియాడుతున్నారు. మీడియాలో అయితే ఆమెకు సంబంధించి పుంఖాను పుంఖాను కథనాలు వెలువడుతున్నాయి. ఇలా గత వారంలో రోజులగా ఆమె పేరు దేశ్యాప్తంగా మారుమోగుతుంది.(మమతాజీ..10 లక్షల సాయమేనా?) స్వప్నబర్మన్ ఓ నిరుపేద అథ్లెట్ అని, రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి పతకం సాధించిందన్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరుపేద అథ్లెట్‌కు అండగా నిలిచింది భారత మాజీ క్రికెటర్, దివాల్ రాహుల్ ద్రవిడ్. స్వప్న బర్మన్ తండ్రి ఓ రిక్షా పుల్లర్. ఆయనకు రెండు సార్లు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి టీ తోటలో పనిచేపే దినసరి కూలి. ఈ పరిస్థితుల్లో స్మప్న ఆటను కొనసాగించడం కష్టమైంది. దీంతోనే ఆమె తన ఆటకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అదే జరిగితే నేడు భారత్ ఓ బంగారం లాంటి అథ్లెట్‌ను కోల్పోయేది. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రవిడ్ ఆర్థికంగా చేయూతనిచ్చాడు. ద్రవిడ్ మెంటార్ షిప్ కార్యక్రమం ద్వారా ఆర్థికంగానే కాకుండా మానసికంగా ధృడం అయ్యేలా శిక్షణను ఇచ్చాడు. ఆమెకే కాదు 2018 ఏషియాడ్‌లో పాల్గొన్న మరో 19 అథ్లెట్లకు ‘వాల్ ఆఫ్ క్రికెట్’ అనే పేరుతో ఆర్థికంగా సాయం చేసి ప్రోత్సాహించాడు. గో స్పోర్ట్స్ భాగస్వామ్యంతో ద్రవిడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల గ్రామాల్లోని క్రీడా ఆణిముత్యాల ప్రతిభను వెలకితీయడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశ్యం. ఇలా ఎంతో మంది అథ్లెట్లను ద్రవిడ్ ప్రపంచానికి పరిచయం చేశాడు.. చేస్తున్నాడు. చదవండి: 'స్వప్న' సాకారం -
ఓ నిరుపేద అథ్లెట్ తల్లి భావోద్వేగం
స్వప్న బర్మన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఏషియన్ గేమ్స్‌లో కఠినమైన ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ విభాగంలో పసిడి అందించిన వీర వనిత. 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను అందుకొని శిఖరాన నిలిచిన 21 ఏళ్ల బెంగాల్ అమ్మాయి. ప్రస్తుతం స్వప్న బర్మన్పై సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఆమె ఈ ఘనతను అంత సులువుగా అందుకోలేదు. నాడు కష్టాలతో సహవాసం చేసింది కాబట్టే నేడు చాంపియన్ అయింది. స్వప్న బర్మన్ ఎన్ని కష్టాలు పడ్డదో ఆమె తల్లి భావోద్వేగం తెలియజేస్తోంది. స్వప్న ఆటను టీవీలో తిలికించిన ఆమె తల్లి స్వప్న కల సాకారం కావడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. బిడ్డ కష్టాన్నంత గుర్తు తెచ్చుకొని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసింది. అంతటితో ఆగకుండా సమీప దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. స్వప్న బర్మన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి స్థానికంగా ఉండే టీకొట్టులో పనిచేస్తోంది. ఉండటానికి సరిగ్గా ఇళ్లు కూడా లేదు. డబ్బాలాంటి ఓ రేకుల షెడ్డులో ఈ కుటుంబం కాలం వెళ్లదిస్తోంది. తండ్రి కూడా ఐదేళ్లుగా ఆనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయం, తల్లి కష్టంతోనే ఇల్లు గడిచింది. దీనికి తోడు ఆమె శరీరాకృతి కూడా సమస్యగా మారింది. శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది. మరోవైపు రెండు కాళ్లకు ఆరేళ్లు. షూస్‌తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. ఏకబికిన ఏడు ఈవెంట్లలో పాల్గొనడం మరెంతో కష్టం... కానీ ఇంతకు మించిన కష్టాలే నిత్యం చవిచూసిన బర్మన్కు ఈ హెప్టాథ్లాన్ పోటీ ఏపాటిది! అందుకేనేమో సౌకర్యం సంగతి పక్కనబెట్టింది. పసిడే లక్ష్యంగా బరిలోకిదిగి విజయం సొంతం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడుతూ...’నేను మాములు షూస్నే ధరించాను. ట్రెయినింగ్‌లో చాలా నొప్పిగా ఉండేది. నాకు అవి చాలా అసౌకర్యంగా ఉండేవి.’ అంటూ తన కష్టాన్ని వివరంచింది. మమతాజీ..10 లక్షలేనా? స్వప్న బర్మన్ ప్రతిభను గుర్తించిన ప్రశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. అయితే ఈ నజరానాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిరుపేద అథ్లెట్‌కు ఈ సహకారం సరిపోదని కామెంట్ చేస్తున్నారు. ఆమెకు ఆర్థికంగా సహకారం అందిస్తే భారత్‌కు మరిన్నీ పతకాలు తెచ్చిపెడుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇక రజత పతకాలు సాధించిన ద్యుతిచంద్‌కు ఒడిశా ప్రభుత్వం రూ. కోటిన్నర్ నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: 'స్వప్న' సాకారం