Swaraj India
-
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్‌సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
‘చలో ఢిల్లీ’ రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను, ఇతర నిరసనకారులను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు. రైతన్నలపై పోలీసుల జులుం పంజాబ్–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్సర్–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్ జిల్లాలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్ కేనన్ల ప్రయోగం -
మున్సిపల్ ఎన్నికల బరిలో స్వరాజ్ ఇండియా!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయాలని యోగేంద్రయాదవ్ నేతృత్వంలోని స్వరాజ్ ఇండియా పార్టీ యోచిస్తోంది. త్వరలో జరగనున్న గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలో పోటీ చేయాలా? వద్దా అనే విషయంపై పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనుపమ్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 2 న ప్రారంభమైన స్వరాజ్ ఇండియా పార్టీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం అజిత్ ఝా నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. -
యోగేంద్ర, భూషణ్‌ల కొత్త పార్టీ ‘స్వరాజ్ ఇండియా’
ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు ఆదివారం ‘స్వరాజ్ ఇండియా’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోవడం లేదని తెలిపారు. పార్టీకి యోగేంద్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టిన ధరమ్వీర గాంధీ(సస్పెండైన పంజా బ్ ఆప్ ఎంపీ)కి మద్దతిస్తామని యోగేంద్ర చెప్పారు. ఆమ్ ఆద్మీకి(సామాన్యుడికి) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ద్రోహం చేశారని ఆరోపించారు. తమ పార్టీ ప్రత్యమ్నాయ రాజకీయాలను తీసుకొస్తుందని, వ్యక్తిపూజ రాజకీయాలకు పాల్పడదని అన్నారు. తమ పార్టీ తనంత తాను ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎమ్మెల్యేలు, ఎంపీలపై విప్ ప్రయోగించదని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. విప్‌ను కేవలం అవిశ్వాస పరీక్షకే పరిమతం చేస్తామన్నారు. తమ సంస్థ ఇకముందూ కొనసాగుతుందని యోగేంద్ర, భూషణ్‌లు స్థాపించిన స్వరాజ్ అభియాన్ తెలిపింది. దీనికి భూషణ్ నాయకత్వం వహిస్తారు.