ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని స్వరాజ్ ఇండియా పార్టీ యోచిస్తోంది.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయాలని యోగేంద్రయాదవ్ నేతృత్వంలోని స్వరాజ్ ఇండియా పార్టీ యోచిస్తోంది. త్వరలో జరగనున్న గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలో పోటీ చేయాలా? వద్దా అనే విషయంపై పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనుపమ్ తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 2 న ప్రారంభమైన స్వరాజ్ ఇండియా పార్టీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం అజిత్ ఝా నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.