స్వర్ణభారతి ట్రస్ట్ భవనానికి భూమిపూజ
హైదరాబాద్ : స్వర్ణభారతి ట్రస్ట్ భూమి పూజ శుక్రవారం శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో జరిగింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పదమూడేళ్ల కిందట స్నేహితులతో కలిసి వెంకయ్యనాయుడు స్వర్ణభారతి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. చాలా కాలంగా స్వర్ణభారతి ట్రస్ట్ ను వెంకయ్య కుమార్తె నడుపుతున్న విషయం తెలిసిందే.