ఎన్నిసార్లు దానం చేసినా తరగని నిధి
నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం
నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేని ఏటా అక్టోబర్ ఒకటవ తేదీన నిర్వహిస్తున్నాం. స్వరూప క్రిష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో 1975లో మొదలైన ఈ పద్ధతి నిరంతరాయంగా విజయవంతంగా కొనసాగుతోంది.
ప్రజలకు రక్తదానం ఆవశ్యకత తెలియచేస్తూ రక్తదానం చేయడానికి చైతన్యం కలిగించడం ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్లకు సమయానికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం రోడ్డు ప్రమాదాలు, ఆపరేషన్ల వంటి అవసరాలకు తగినంత రక్తం నిల్వలు ఉండేలా నిధిని ఏర్పాటు చేయడం రక్తదాతల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచి రక్తదానం చేయడం పట్ల ఆసక్తిని పెంచడం ఆరోగ్యకరమైన రక్తాన్ని పరిశుభ్రమైన పద్ధతుల్లో సేకరించి ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు నిల్వ చేయడం... నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్డే ప్రధాన ఉద్దేశాలు.
మహారాష్ట్ర, త్రిపుర, తమిళనాడు, వెస్ట్‌బెంగాల్ రాష్ట్రాల్లో రక్తదాతలు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 93 శాతం ప్రజలు రక్తదానం చేయడానికి పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఎక్కువసార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమే. ఈ లక్ష్యంతో ముందుకు రావడానికి ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చే ఆ సందర్భంలో మరింత సమాచారం కోసం కింది వెబ్సైట్లను చూడవచ్చు.
indianblooddonors.com; bharatbloodbank.com
bloodbankindia.net; friends2support; indianredcross society