Sweets Distribution
-
ప్రభుత్వ బ్యాంక్ ‘స్వీట్’ ఐడియా! మిఠాయిలిచ్చి ప్రేమగా అడుగుదాం..
మొండి బకాయిలను రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ (UCO Bank) సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి శాఖలోని టాప్ 10 డిఫాల్టర్లకు 'స్వీట్ ప్యాకెట్లు' పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. వాళ్లూ ఒకప్పుడు విలువైన కస్టమర్లే ప్రస్తుతం డిఫాల్టర్‌గా మారినవాళ్లు ఒకప్పుడు విలువైన కస్టమర్ అనే విషయాన్ని బ్యాంకు మరచిపోదని యూకో బ్యాంక్ జనరల్ మేనేజర్ (రికవరీ) ధీరజ్ పట్వర్ధన్ అన్ని జోనల్ హెడ్లకు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్! కాబట్టి, అటువంటి కస్టమర్లతో "సరైన అనుసంధానం"తో వారికి, బ్యాంకుకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు. దీనివల్ల బ్యాంక్ పట్ల సానుభూతి, సామరస్యం పెరుగుతాయని, కొంత మంది రుణగ్రహీతలు తమ బకాయిలు సెటిల్ చేయడానికి ముందుకు వస్తారని వివరించారు. స్వీట్లిచ్చి దీపావళి శుభాకాంక్షలు దీనికి సంబంధించి యూకో బ్యాంక్ జారీ సర్కులర్‌ను ప్రముఖ బ్యాంకింగ్ కాలమిస్ట్ తమల్ బందోపాధ్యాయ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రతి బ్రాంచ్‌లోని టాప్ 10 ఎన్పీఏ రుణగ్రహీతలకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని, బ్రాంచ్ హెడ్లు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని సర్క్యులర్‌లో బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను! గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 124 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 223 కోట్లకు పెరిగి 80.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,650 కోట్ల నుంచి 21.78 శాతం పెరిగి రూ. 2,009 కోట్లకు చేరుకున్నట్లు యూకో బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఎన్పీఏ రుణాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 4.48 శాతంగా ఉన్నాయి. ఇవి మార్చిలో 4.78 శాతం కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో 7.42 శాతంగా ఉన్నాయి. Wonderful idea. UCO Bank plans to celebrate Diwali, greeting top ten #NPA borrowers of every branch with sweets. @UCOBankOfficial @ChairmanIba @ChiefIba pic.twitter.com/HZJMenPnz5 — Tamal Bandyopadhyay (@TamalBandyo) November 2, 2023 -
ప్లాస్టిక్ తెస్తే పావు కేజీ స్వీటు
జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు పలుమార్లు ఈ తరహా చర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రాలేదు. దీంతో తాజాగా వినూత్న తరహాలో పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలపై సమరభేరికి కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రోటరీ క్లబ్ విజయనగరంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిషేధించిన 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు చర్యలు తీసుకోనుంది. ఈనెల 17న జొన్నగుడ్డి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – విజయనగరం సాక్షి, విజయనగరం : నగరంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ఈ విడత వినూత్న పంధాతో కార్పొరేషన్ ముందడుగు వేస్తోంది. రోటరీ క్లబ్ విజయనగరం అనుసంధానంతో నిర్వహించనున్న ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే వారికి పావు కిలో స్వీట్‌బాక్స్ ఇస్తారు. మరింత మంది దాతలు ముందుకొస్తే అర డజను గుడ్లను ప్యాక్ చేసి అందించాలని భావిస్తున్నారు. అదే పెద్ద పెద్ద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు ఒకేసారి 250 కిలోల ప్లాస్టిక్‌ను ఇస్తే వారికి భారీ నజరానా చెల్లించనున్నారు. ఇలా ఇంట్లో ఉండే హానికరమైన ఒక్కసారి వినియోగించే పారేయాల్సిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాజీవ్‌నగర్ కాలనీ, దాసన్నపేట ప్రాంతాల్లో నిర్వహించగా.. మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో వారిలో మరింత చైతన్య నింపేందుకు ఇంటింటికి ప్రత్యేకంగా డస్డ్బిన్లు పంపిణీ చేశారు. అపార్ట్మెంట్లలో నివసించే వారైతే హోమ్ కంపోస్ట్‌ను తయారు చేసుకునే దిశగా చైతన్యపరుస్తున్నారు. ఈసారైన విజయవంతమయ్యేనా? ఈ ఏడాదిలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ విక్రయాలపై ప్రజారోగ్య విభాగం అధికారులు గట్టిగానే కొరఢా ఝళిపించారు. దాదాపు 80 శాతం ఈ తరహా ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ పలు కారణాలతో అధికారులు దాడులు నిలిపివేయటంతో మళ్లీ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. కోలగట్లతో ప్రారంభం జొన్నగుడ్డి ప్రాంతంలో తొలుత ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రవి మండాలు వెల్లడించారు. వారు గురువారం కార్పొరేషన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా ప్రాంతీయులకు ముందుగా సమాచారం అందజేస్తామన్నారు. 250 కిలోలకు పైగా ప్లాస్టిక్‌ను అందజేసిన వారిని జనవరి 26న కలెక్టర్‌తో సన్మానించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ అమలుకు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని తెలిపారు. నలభై వేల ఇళ్లకు గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని వివరించారు. -
శాంతి నగరంలో మహిళా క్రాంతి
ఒకప్పుడు వారి వృత్తి వ్యవసాయం..పొలంలో పనిచేస్తేగాని కుటుంబాలు గడిచేవి కావు. ఎంత కష్టపడినా మిగులు బాటు ఉండేది కాదు. ప్రకృతి వైపరీత్యాలో..చీడపీడలో.. మార్కెట్లో పతనమైన ధరలో.. వారి ఆశలపై నీళ్లు చల్లేవి. ఇంటి అవసరాల కోసం..పిల్లల చదువుల కోసం మళ్లీ రెక్కల కష్టాన్ని నమ్ముకోవాల్సి వచ్చేది. అయితే ఓ ఆలోచన వారి జీవితంతో మార్పు తెచ్చింది. వంటల్లో, అల్లికల్లో వారి అభి‘రుచి’ ఉపాధికి దారి చూపింది. వారు సాధించిన విజయం నారీమణులకు స్ఫూర్తిగా నిలిచింది. కర్నూలు, ఆళ్లగడ్డ: శాంతి నగరం.. బత్తలూరు పంచాయతీలోని ఓ గ్రామం. ఈ ఊరిలో ఇంటికో ఉద్యోగి ఉన్నారు. సీఏ, బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు చదివి.. పలువురు విదేశాల్లో కొలువులు చేస్తున్నారు. ఈ పల్లెకు మరో ప్రత్యేకత ఉంది. అది.. మహిళా శక్తి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆసక్తి. అదే వారిని ముందుకు నడిపించింది. శ్రీ సీత గ్రామైక్య సంఘం ఏర్పాటుకు దారితీసింది. ఏం చేశారంటే.. ఒక్కరితో ఏ పనీ సాధ్యం కాదు. అందరూ కలవాలి..ఆలోచనలు పంచుకోవాలి.. సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోవాలి..ఓ ప్రణాళిక కూడా అవసరమే.. శాంతినగరం మహిళలు ఈ ఆంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి..ముప్ఫై మంది మహిళలు ఏకమయ్యారు. తమకు తెలిసిన వంటలు, జ్యూట్ బ్యాగులు, అలంకరణ వస్తువుల తయారీని మార్కెటింగ్ చేయాలనుకున్నారు. వంట తయారీకి గ్రామంలోని ఓ ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. బొప్పట్లు, తీపిగవ్వలు, గారెలు(అత్తరాసెలు), కారాలు తది తర వాటిని స్వయంగా చేసి 250 గ్రాముల ప్యాక్‌తో సిద్ధం చేసి అమ్మేవారు. వివాహాది శుభకార్యాలకు క్యాటరింగ్ చేసేవారు. వంటలు రుచిగా ఉండడం, ధర తక్కువగా ఉండడంతో మంచి పేరు వచ్చింది. వ్యాపారం బాగా జరగడంతో లాభాలు వచ్చాయి. అందుకే వారు తాము తయారు చేసే వంటలకు శ్రీ లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ అని నామకరణం చేశారు. గృహోపకరణాలు తయారీ.. ఇంటి అలకంకరణ వస్తువులు, పూసల బ్యాగులు, పెన్స్టాండ్లు తదితర వాటిని జ్యూట్‌తో తయారీ చేస్తుంటారు. మార్కెట్లో లభించే వివిధ రకాల రంగులను తెచ్చుకుని నచ్చిన రంగులో జ్యూట్‌ను తయారు చేసుకుంటారు. చుడ్డానికి ఎంతో ఆకర్షించే ఆ వస్తువులు బహుమతులు ఇవ్వడానికి, గృహాల అలంకరణలకు ఉపయోగపడతాయి. ముడిసరకు వీరు బెంగళూరు, హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటారు. సొంత నిధులతోనే.. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో సొంతనిధులతో వారు.. పిండివంటలకు కావాల్సిన సరుకులను పెద్దమొత్తంలో ఒకేసారి తెచ్చుకుంటున్నారు. ఇంట్లో పనుల అనంతరం తీరికవేళల్లో వం టలు, గృహోపకరణాలు తయారు చేస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సూపర్ మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముతారు. ఎవరైనా అర్డర్ ఇస్తే తీసుకెళ్లి ఇస్తారు. వచ్చిన మొత్తాన్ని సమభాగాలుగా పంచుకుంటారు. మూడేళ్లుగా ఒక్కో మహిళకు రూ.10 వేల వరకు నెల ఆదాయం వస్తున్నట్లు వారు చెబుతున్నారు. వచ్చిన డబ్బుతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నామన్నారు. అధికారుల ప్రశంస ఇటీవల కర్నూలులో జరిగిన గణంత్ర వేడుకల్లో శాంతినగరం మహిళలు స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాల్లో ఉన్న ఫుడ్స్, గృహోపకరణాలను చూసి జిల్లా కలెక్టరు సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి ప్రశంసించారు. ఆదరణ పెరుగుతోంది మా స్వగృహ ఫుడ్స్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుంది. నేను మార్కెటింగ్ చేస్తుంటాను. చాలా మంది ఆర్డర్లు ఇస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. మాకు మేమే ఉపాధిని ఏర్పాటు చేసుకున్నాం. – రమాదేవి, శాంతినగరం ఐక్యతే విజయం వైపు దారి చూపుతోంది టీంలోని మహిళలందూ ఐక్యంగా ఉండటంతో విజయం వైపు అడుగులు వేస్తున్నాం. సక్సెస్ అవుతామా లేదా అనే భయం మొదట ఎక్కువగా ఉండేది. తోటి మహిళల ప్రోత్సాహకం బాగుంది. మా స్వగృహ ఫుడ్స్‌ను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. –విజయలక్ష్మి -
మురిసిన నర్సక్కపల్లి
‘సిరికొండ’ సొంతూరులో సంబురాలు పరకాల: నిన్నమొన్నటి వరకు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకే సుపరిచితుడైన సిరికొండ మధుసూదనాచారి నేడు తెలంగాణ రాష్ట్ర తొలిస్పీకర్‌గా అత్యున్నత పదవిని అలంకరించబోతున్నారు. తమ పల్లెబిడ్డ శాసనసభాపతిగా వ్యవహరించబోతుండడంతో పరకాల మండలంలోని నర్సక్కపల్లి మురిసిపోతోంది. గ్రామస్తులు ఆనందంతో స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరం చేసుకున్నారు. చారి కుటుంబ నేపథ్యం ఇదీ.. నర్సక్కపల్లికి చెందిన సిరికొండ వెంకటలక్ష్మి, వెంకటనర్సయ్య దంపతుల ఎనిమిదిమంది సంతానంలో మధుసూదనాచారి నాలుగోవాడు. తండ్రి స్వర్ణకారుడి గా కులవృత్తి చేసుకుంటూ కు టుంబాన్ని పోషించేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ముం దుండే మధుసూదనాచారి ప్రతీ తరగతిలో ఫస్ట్ రావడంతో కొ డుకును ప్రోత్సహిస్తూ తండ్రి వెంకటనర్సయ్య ఉంగరం బహుమానంగా ఇచ్చేవారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న ‘సిరికొండ’ ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు పరకాలలో, డిగ్రీ వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో, కేయూలో ఎంఏ పూర్తిచేశారు. అనంతరం మేనేజ్మెంట్ డిప్లొమాలో పీజీ చేసిన చారి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 1994లో తొలి విజయం 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన చారి మాజీ మంత్రి మందాడి నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ చీలిక తరువాత ఎన్టీర్ టీడీపీలో చేరారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావానికి విశేష కృషి చేశారు. 2009లో భూపాలపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. అయినా పార్టీలో రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో కొనసాగారు. రెండుసార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. కేసీఆర్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆ సన్నిహితమే ఇప్పుడు ఆయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టింది. స్పీకర్ పదవి కోసం పలువురి పేర్లు పరిశీలించిన సీఎం కేసీఆర్ చివరకు సిరికొండ వైపే మొగ్గుచూపారు. దీంతో ఆయన ఒక్కరితోనే నామినేషన్ వేయించి ఎన్నిక లాంఛనప్రాయం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా నర్సక్కపల్లి బిడ్డకు అవకాశం రావడంతో గ్రామస్తులు పొంగిపోతున్నారు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. నా శిష్యుడి ఎదుగుదల సంతోషంగా ఉంది ఎమ్మెల్యేగా మధు ఎన్నికైనప్పుడు దగ్గరుండి అభినందించా. 1999 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కొంత బాధనిపించినా రాజకీయాల్లో రాణిస్తాడనే నమ్మకం ఉండేది. ఇంగ్లిష్‌పై పట్టున్న చారికి శాసనసభలోనే పెద్ద పదవి రావడం గొప్ప విషయం. జిల్లాలోనే ఎవరికీ ఇంతటి అరుదైన అవకాశం దక్కలేదు. చారి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. - బాసాని వీరస్వామి, రిటైర్డ ఉపాధ్యాయుడు పిలిచి మాట్లాడతాడు మధు నా కళ్లముందే పెరిగాడు. పండుగలకు మా ఊరు వచ్చినప్పుడు నన్ను పిలిచి మాట్లాడతాడు. ఆయన మాటతీరు ఎంతో బాగుం టుంది. నాయనా, బాపూ అంటూ పలకరిస్తాడు. ఇప్పుడాయన కు పెద్ద పదవి రావడం ఆనందంగా ఉంది. - కేశిరెడ్డి గోపాల్‌రెడ్డి, గ్రామస్తుడు వచ్చేముందే ఫోన్ చేస్తాడు చిన్నప్పటి నుంచి మధు అన్నతో కలిసి బాయిలళ్ల, చెరువులళ్ల ఈత కొట్టేది. ఊళ్లో ఆటలాడుకునేది. బాగా చదువుకున్న మధన్న పట్నం పోయిండు. ఎప్పుడైనా ఊరికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఉండమని చెప్తాడు. పెద్ద పదవి వచ్చిదంటే చానా సంబురమైతంది. మా ఊరికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. - ఆముదపు రాజీరు, బాల్యస్నేహితుడు మా ఊరు రాష్ట్రానికి తెలిసింది మధన్న స్పీకర్‌గా ఎన్నికవడంతో మా గ్రామం గురించి రాష్ట్రానికి తెలి సింది. గ్రామంలో అందరికీ రాజకీయాలపై అవగాహన ఉంది. తెలంగాణ రా ష్ట్రంలో మొదటి స్పీకర్‌గా సిరికొండ రికార్డు సృష్టించారు. సభను సజావుగా నడిపించి మంచి స్పీకర్‌గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. - పాడి ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు