చక్కటి కలబోత
ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. రెహన్, అమోఘ్ దేశపతి, శ్వేతాజాదవ్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీ చక్రికా ఫిలింస్ పతాకంపై నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం కలబోతగా చాలా చక్కగా చిత్రాన్ని తీర్చిదిద్దామని దర్శకుడు పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి.