లాభాల్లోకి టాటా స్టీల్ క్యూ 1 ఫలితాలు
ముంబై: స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ లిమిటెడ్ బాగా తేరుకుంది. అంచాలనకనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలనుంచి కోలుకొని లాభాలను నమోదు చేసింది. సంవత్సరం క్రితం నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లి రూ.921 కోట్ల నికర లాభాలను సాధించింది. సోమవారం టాటా స్టీల్ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్యూ 1 ఫలితాలను ప్రకటించింది.
జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో స్టీల్ మేకర్ నికర లాభం 921 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,183 కోట్లు నష్టపోయింది. ముఖ్యంగా కళింగ నగర్ ప్లాంట్ ద్వారా అమ్మకాలు సంస్థ లాభాలకు మంచి బూస్ట్నుఅందించాయి. ఈ త్రైమాసికంలో స్థూల ఋణం రూ .4,798 కోట్లు పెరగడంతో ఫారెక్స్ ప్రభావం పెరిగింది. మరోవైపు ఫలితాలు మెరుగ్గా ఉండనున్నాయనే నేపథ్యంలో సోమవారం బిఎస్ఇలో టాటా స్టీల్ కౌంటర్ 4 శాతం ఎగిసి 600 రూపాయలకు చేరుకుంది.