swiss challenge model
-
స్విస్ ఛాలెంజ్‌పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో గురువారం విచారణ జరుగుతోంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. -
స్విస్ చాలెంజ్‌పై గడువు కోరిన ఏపీ సర్కార్
-
స్విస్ చాలెంజ్‌పై గడువు కోరిన ఏపీ సర్కార్
హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ, హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అయితే మంగళవారం వరకు తమకు సమయం కావాలని ఏపీ సర్కార్ కోరింది. కాగా చివరిక్షణంలో సమయం అడగడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు, కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్..సోమవారం నోటిఫికేషన్‌తో వస్తామని హైకోర్టుకు తెలియచేశారు. -
చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని....
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణంపై హైకోర్టు వ్యాఖ్యలు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. స్విస్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని స్విస్ ఛాలెంజ్ పద్దతిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. -
'స్విస్ చాలెంజ్' వద్దు: ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో సీఎం చంద్రబాబు ఆడుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీని చంద్రబాబు తెల్లదొరల చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. స్విచ్ చాలెంజ్ పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని గుర్తు చేశారు. టీడీపీ తెలుగు దొంగల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. మంత్రులను దద్దమ్మల్లా చంద్రబాబు ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినదానికి కల్లా గంగిరెద్దుల్లా తలాడిస్తూ ప్రజలను మంత్రులు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్విచ్ చాలెంజ్ పద్ధతిని అడ్డుకునేందుకు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. దీన్ని కేంద్రం అడ్డుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే రోజా అన్నారు.