స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో గురువారం విచారణ జరుగుతోంది.
హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో గురువారం విచారణ జరుగుతోంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.