
స్విస్ చాలెంజ్‌పై గడువు కోరిన ఏపీ సర్కార్
స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ, హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అయితే మంగళవారం వరకు తమకు సమయం కావాలని ఏపీ సర్కార్ కోరింది. కాగా చివరిక్షణంలో సమయం అడగడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు, కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్..సోమవారం నోటిఫికేషన్‌తో వస్తామని హైకోర్టుకు తెలియచేశారు.