sworn in as minister
-
వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్(45) బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణంచేశారు. చపాక్–తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డీఎంకే వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో చెన్నైలో గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్ఎన్ రవి ఈయన చేత మంత్రిగా ప్రమాణంచేయించారు. పార్టీలో యువజన విభాగం కార్యదర్శి అయిన ఈయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను డీఎంకే సర్కార్ కేటాయించింది. కుటుంబ రాజకీయాలను విమర్శించే వారికి తన అద్భుత పనితీరు ద్వారా సమాధానం చెప్తానని ఈ సందర్భంగా ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రాన్ని దేశానికే క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇదీ చదవండి: Gujarat Election 2022: గుజరాత్ ఓటేసిందిలా... -
కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి కేబినెట్లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా.. 2021లో చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఎంకే స్టాలిన్ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆ తర్వాత మాజీ సీఎం ఎం కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యూత్ వింగ్ బాధ్యతలను ఉదయనిధికి 2019లో అప్పగించారు. ఇదీ చదవండి: Sarathkumar: రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -
మంత్రి యోగం ఎవరికో?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు దాటిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని కొలువు దీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సన్నద్ధమయ్యారు. శాసనసభలో కీలకమైన ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో గురువారం ఆయన లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే ప్రస్తుతం కేబినెట్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18న మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే వెల్లడించారు. మంత్రి వర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది సభ్యులు ఉండేందుకు వీలున్న పరిస్థితుల్లో విస్తరణలో ఎందరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. పరిమిత సంఖ్యలోనే మంత్రులను నియమించి, మరికొం దరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు కట్టబెడతారని, కొత్తగా ఏర్పాటైన ప్రతీ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్ స్థాయి హోదా దక్కనుందని టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు, మరో ఇద్దరికి పార్లమెంటరీ కా ర్యదర్శి లేదా ఇతర కేబినెట్ హోదాలో ఓ పదవి రావచ్చు. ఆ పదవులు సైతం 18వ తేదీనే లభిస్తాయా..ఇంకొంత కాలం వేచిచూడాలా అనేది సస్పెన్స్. ఐకే రెడ్డికి మంత్రి పదవా.. స్పీకర్ హోదానా? 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచి, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని నాలుగేళ్లకుపైగా వివాదరహిత కేబినెట్ మంత్రిగా సేవలందించిన సీనియర్ నేత అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డికి మరోసారి ఉన్నత పదవి దక్కడం ఖాయమని తేలిపోయింది. కీలకమైన మంత్రి పదవి ఆశిస్తున్న ఐకే రెడ్డికి స్పీకర్ పదవిని కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడు, న్యాయశాఖ మంత్రిగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా పలు కీలక పదవులు నిర్వహించిన ఐకే రెడ్డి స్పీకర్‌గా న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే స్పీకర్ పదవి నిర్వహించిన వారు తరువాత ఎన్నికల్లో ‘ఓటమి’ పాలవుతారనే సెంటిమెంట్ ప్రచారంలో ఉండడంతో ఐకే రెడ్డి ఆ పదవికి అంగీకరిస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ స్పీకర్‌గా కొనసాగేందుకు ఐకే రెడ్డి ఒప్పుకోకపోయినా.. ఐకే రెడ్డితో ముఖ్యమంత్రికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రాష్ట్రంలో కీలకమైన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో అవకాశంకోసం రామన్న.. ఆదిలాబాద్ చరిత్రలో వరుసగా మూడుసార్లు గెలిచిన జోగు రామన్న గత కేబినెట్లో పూర్తికాలం మంత్రిగా పనిచేశారు. మంత్రిగా తొలుత కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా..తరువాత ముఖ్య మంత్రి నుంచి మంచి మార్కులు సంపాదించా రు. ఉమ్మడి జిల్లాలో బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక బీసీ ఎమ్మెల్యే ఆ యనే కావడం కలిసివచ్చే అంశం. ఉత్తర తెలం గాణ నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎ మ్మెల్యేకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తే రామన్నకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. నిజా మాబాద్, కరీంనగర్ నుంచి ఈ వర్గం ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిని ఆశిస్తుండడం గమనార్హం. తూర్పు జిల్లా నుంచి సుమన్! తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న యువ నాయకుడు బాల్క సుమన్ ఎంపీగా కొనసాగుతూనే అనూహ్య పరిస్థితుల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయనను గెలిపిస్తే ఉన్నతస్థానం కల్పిస్తానని మందమర్రి ఎన్నికల ప్రచార సభలోనే కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తూర్పు ఆదిలాబాద్ పరిధిలోని మంచిర్యాల జిల్లా నుంచి సుమన్‌కు కేబినెట్లో అవకాశం లభించే అవకాశం ఉంది. అయితే పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఈశ్వర్ సామాజిక వర్గానికే చెందిన సుమన్‌కు కూడా ఒకే లోక్‌సభ పరిధిలో మంత్రి పదవి ఇస్తారా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈశ్వర్‌కు స్పీకర్ హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సుమన్‌కు మంత్రి పదవి లభిస్తుందా..? లేక కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్, విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో మరేదైనా ఉంటుందా అని టీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఏదేమైనా సుమన్‌కు కేబినెట్ హోదా మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సైతం నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా..ఉత్తర తెలంగాణలో ఆయన సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ నెలకొనడంతో ఇబ్బందిగా మారింది. కుమురంభీం జిల్లా నుంచి సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈసారి ‘కమ్మ’ కోటాపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోగా, సీనియర్ ఎమ్మెల్యేగా తనకు ఆ సామాజికవర్గం కోటాలో అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు. ఎస్టీ, మహిళా కోటాపై రేఖానాయక్ ఆశలు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించిన ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన రేఖానాయక్ తనకీసారి కేబినెట్ హోదా ఖాయమనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలోనే టీఆర్ఎస్ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు ముగ్గురు కాగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే రేఖానాయక్. గతంలోనే మహిళ లేకుండా కేబినెట్ కొనసాగించారనే అపప్రద ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి మహిళా మంత్రి తప్పనిసరి అని స్పష్టమైంది. ఎస్టీ వర్గం నుంచి గతంలో మంత్రిగా ఉన్న చందూలాల్ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఈ నేపథ్యంలో రేఖానాయక్‌కు అవకాశం ఇస్తే ఎస్టీతోపాటు మహిళా కోటాలో మంత్రి పదవి భర్తీ చేసినట్లవుతుంది. కొసమెరుపు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే మంత్రిపదవులు దక్కుతాయి. సీనియర్లు ఆశిస్తున్నా.. డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఒకటి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌కు మరోటి మంత్రి పదవి ఇచ్చి, మరో రెండు పదవులు పార్లమెంటరీ సెక్రెటరీ లేదా ఇతర కేబినెట్ హోదాలో మాత్రమే దక్కే అవకాశం ఉంది. -
ఇది గౌరవమేనా?
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధమైంది! ఈమేరకు ఏపీ శాసనమండలి చైర్మన్ ఫరూక్, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌లకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందచేసినట్లు తెలిసింది. ఆదివారం రోజు ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారిద్దరికీ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అనాదిగా అదే ఆనవాయితీ.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో చూసినా మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గ ఏర్పాటు ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయిన తరువాత ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు వెళ్లే ముందు మైనారిటీ, ఎస్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం ఆ వర్గాలకు సన్మానమా? అవమానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని తెచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే తమను ఎలా గౌరవించినట్లు అవుతుందని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఆయా వర్గాలను గౌరవించడం కాదు అవమానించినట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పదవిస్తే అవమానం మాసిపోతుందా? రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన సలహా మండలి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో గిరిజన సలహా మండలిని నియమించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేసింది. దీనిపై పోరాడిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత పోరాటంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రి పదవిలోకి తీసుకున్నా ఇన్నేళ్లుగా గిరిజన వర్గానికి సర్కారు చేసిన అన్యాయం, అవమానం మాసిపోదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నిక కాకుండానే మంత్రిగా శ్రవణ్! మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నందున కిడారి శ్రవణ్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సభకూ ఎన్నిక కాకుండానే శ్రవణ్ మంత్రిగా కొనసాగుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ కోడెల ఆఖరి ప్రయత్నం.. విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్న క్యాంటీన్ కోసం రూ.5 లక్షల విరాళాన్ని అందించేందుకు వచ్చిన కోడెల శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రెండు బెర్తులే ఖాళీగా ఉన్నాయని, వాటిని ముస్లిం, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తన వద్దే ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆ శాఖ తీసుకోవాలని యనమల రామకృష్ణుడికి సూచించినా వివాదాలున్నాయనే కారణంతో ఆయన నిరాకరించారు. గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ)ను ఆదేశించింది. -
సైనికుడిలా పనిచేస్తా- శ్రీహరి
-
డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరి
-
డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులేశారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించి, ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. మంత్రివర్గంలో వివిధ మార్పుచేర్పులు కూడా చకచకా చేసేశారు. కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు.. ఆయనకు విద్యాశాఖను అప్పగించారు. ఇన్నాళ్లూ విద్యాశాఖను నిర్వర్తించిన జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ అప్పగించారు. ఇంతకుముందు రాజయ్య వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను లక్ష్మారెడ్డికి ఇచ్చారు. రాజయ్యను తప్పించాలన్న మంత్రివర్గ సిఫార్సును గవర్నర్ ఆమోదించడంతో రాజయ్య మంత్రిపదవి, ఉప ముఖ్యమంత్రి పదవి పోయాయి. ఆ తర్వాత వెంటనే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చెప్పడంతో ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం కూడా చేయించేశారు. ఆ తర్వాత మంత్రివర్గంలో మార్పుచేర్పులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కడియం శ్రీహరికే ఇచ్చారు.