sworn-in as ministers
-
తొలి పది పదిలం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు రెండ్రోజులే ఉండటంతో కేబినెట్ కూర్పు కసరత్తు ముమ్మరమైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు పార్టీ సీనియర్ నేతలు, ఎన్డీయే పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ప్రధాని కార్యాలయంలో (పీఎంఓ) మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్థానంలో మరొకరు రావచ్చని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పీఎంఓలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్‌తో పాటు మరికొన్ని కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరి స్థానాలు పదిలం పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్నికైనందున కేబినెట్ కూర్పు కొంత కష్టమేనని, ఒకవేళ సీనియర్లు కొందరికి చోటు దక్కకపోయినా వారు చేయగలిగిందేమీ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ, తావర్ చంద్ గెహ్లోత్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, మేనకా గాంధీ వంటి పది మంది అగ్రనేతలకు కేబినెట్లో తిరిగి చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడి, వారు అంగీకరిస్తే జైట్లీ, సుష్మా స్వరాజ్లను తీసుకోవచ్చని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురు నేతలు రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ (ఇప్పటికే మంత్రులు), పార్టీ అధ్యక్షుడు అమిత్ షా (తొలిసారి మంత్రి అవుతారు)లకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. బెంగాల్‌కు ప్రాధాన్యత పశ్చిమబెంగాల్లో పార్టీ 18 సీట్లతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బాబుల్ సుప్రియో (ప్రస్తుత మంత్రి), లాకెట్ ఛటర్జీ, సుభాష్ సర్కార్, జయంత్ సర్కార్లకు బెంగాల్ నుంచి కేబినెట్లోకి రావొచ్చు. ఎక్కువగా యువతరానికి, కొత్త ముఖాలకు కేబినెట్లో అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ఆ వర్గాలు వెల్లడించాయి. జేడీయూ, శివసేనలతో పాటు ఇతర పార్టీలకు చోటు దొరకొచ్చని చెప్పాయి. కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా! గౌబా 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ అధికారి న్యూఢిల్లీ: కొత్త కేబినెట్ కార్యదర్శిగా హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యే చాన్సుంది. ప్రస్తుత కార్యదర్శి పి.కె.సిన్హా నాలుగేళ్ల పదవీ కాలం జూన్ 12తో ముగుస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. కాగా హోం శాఖ కార్యదర్శి పోస్టు కోసం ఇతరులతో పాటు కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. అత్యంత సీనియర్ అధికారి అయిన గౌబా కేంద్రంలో, జార్ఖండ్, బిహార్ ప్రభుత్వాల్లో పనిచేశారు. ఆగస్టు 31తో హోం శాఖ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. అయితే దేశంలోనే అత్యున్నతమైన కేబినెట్ కార్యదర్శి పోస్టుకు గౌబా ఎంపికయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అధికారి ఒకరు వెల్లడించారు. ఈయన జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన కేబినెట్ కార్యదర్శి అయ్యే పక్షంలో తొలుత రెండేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యే అవకాశం ఉంది. తర్వాత మరో రెండేళ్ల పాటు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది. సిన్హా కూడా 2015లో తొలుత రెండేళ్ల పదవీకాలానికి నియమితులై, తర్వాత 2016, 2018లో పొడిగింపు పొందారు. -
నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
సాక్షి, వనపర్తి : కొందరు పాతవారు.. మరికొందరు కొత్త వారు.. ఇలా వారంతా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు.. వీరిలో కొందరే విజేతలుగా నిలిచారు.. వారందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది! ఎమ్మెల్యేగా ఎన్నికైన 38వ రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం నుంచి అసెంబ్లీ తొలి విడత సమావేశాలు జరగనుండగా మొదటి రోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 37 రోజులు గడుస్తుండగా.. ఇప్పటికే ముహూర్త బలం బాగా లేకపోవడంతో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నెల గడిచాక ప్రమాణ స్వీకారం చేసే ఘడియలు వచ్చేశాయి. ఉమ్మడి జిల్లాలో హవా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ గాలి వీచింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు 13 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాలు దక్కాయి. అయితే, అనంతరం జరిగిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీడీపీ(నారాయణపేట) నుంచి గెలిచిన ఎస్.రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్(మక్తల్) నుంచి గెలిచిన చిట్టెం రాంమోహన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. కానీ తాజా ఎన్నికల్లో మాత్రం 13కు 12 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం. ఇక కొల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలు కావడం గులాబీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఎమ్మెల్యే వీరే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 స్థానాలకు ఎన్నికలు జరగగా 12 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కొడంగల్ నుంచి పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి వి.శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల నుంచి సి.లక్ష్మారెడ్డి, కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు. నారాయణపేట నుంచి రాజేందర్‌రెడ్డి, మక్తల్ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి, దేవరకద్ర నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి, వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అలంపూర్ నుంచి అబ్రహం, గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఇక కొల్లాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. వీరందరూ గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి అసెంబ్లీలోకి... ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న పలువురిని పదవులు ఊరిస్తుంటాయి. ఇలాంటి వారిలో కొందరు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి , గద్వాల నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కొల్లాపూర్ నుంచి గెలిచిన హర్షవర్దన్‌రెడ్డి ఇలా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే, ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరేకాకుండా అలంపూర్ నుంచి అబ్రహం, కల్వకుర్తి నుంచి గెలిచిన జైపాల్‌యాదవ్ గతంలో ఎమ్మెల్యేలుగా కొనసాగారు. మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ వీరిద్దరు ఈసారి గెలవడం విశేషం. అంటే మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన పలువురు ఈసారి 50 వేలకు పైగా మెజార్టీ సాధించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ 57,775, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 54,354, వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 51,685 ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. ఇక రాజకీయ ఉద్దండులైన డీకే.అరుణ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, టీపీపీసీ వర్కింగ్ ప్రసిడెండ్ రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరందరు కూడా కాంగ్రెస్ నుంచే పోటీకి దిగడం గమనార్హం. మంత్రి పదవి ఎవరికో... శాసనసభ గురువారం కొలువు దీరనుండగా అదే రోజు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశాలు ఉండడంతో మంత్రి వర్గ విస్తరణపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే, మొదటి విడతలో మొత్తం కేవలం ఎనిమిది మందికే మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కొచ్చని సమాచారం. సీఎం కేసీఆర్ మొదటి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిళా సంఘం ఉపాధ్యక్షుడిగా గా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్రెడ్డిలో ఒకరికే మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు కనిసిస్తున్నాయి. వీరిద్దరు కూడా టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. ఇక సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేరు పరిశీలనలోకి రానుంది. దీంతో చివరి వరకు మంత్రి వర్గంలో స్థానంపై ఉత్కంఠత కొనసాగక తప్పదని తెలుస్తోంది. -
75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లో నో ఛాన్స్?
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సీనియర్లకు మొండి చెయ్యి చూపే అవకాశాలు కనిపిస్తోంది. 75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లోకి నో ఎంట్రీగా కనిపిస్తోంది. దాంతో పార్టీ సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ (86), మురళీ మనోహర్ జోషీ(80)లకు చోటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్లు అయిన వీరికి కేవలం పార్టీ పర్యవేక్షక బాధ్యతలు మాత్రమే అప్పగించనున్నట్లు సమాచారం. ఇక నరేంద్ర మోడీతో పాటు 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త టీమ్ సభ్యులకు మోడీ ఈరోజు ఉదయం గుజరాత్ భవన్లో తేనీటి విందు ఇచ్చారు. అలాగే పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అవుతున్నారు. అంతకు ముందు నరేంద్ర మోడీ మాజీ ప్రధాని వాజ్‌పాయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. -
రాష్ట్రపతికి కొత్త మంత్రుల జాబితా
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే మంత్రుల జాబితాను నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. 35మందితో మోడీ మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీరిలో 17మంది కేబినెట్, 18 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా చిన్న కేబినెట్‌తో ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ ఈరోజు ఉదయం టీం సభ్యులతో గుజరాత్ భవన్లో భేటీ అయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజులకు చోటు దక్కనుంది. కాగా మంత్రివర్గంలో చోటు దక్కిన వారికి రాష్ట్రపతి భవన్ అధికారులు సమాచారం అందిస్తున్నారు. మోడీతోపాటు 18 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 1. నిర్మలా సీతారామన్ 2. సుష్మాస్వరాజ్ - విదేశీ వ్యవహారాలు 3. రవిశంకర్ ప్రసాద్ -సమమాచారశాఖ మంత్రి 4.రాజ్ నాధ్ సింగ్- హోంమంత్రి 5. ధర్మేంధ్ర ప్రధాన్ 6.గోపినాధ్ ముండే 7.రాం విలాస్ పాశ్వాన్ 8. అనంత్ కుమార్ 9. నజ్మా హెప్తుల్లా 10.ఉమాభారతి, 11.వి.కె.సింగ్ 12.హర్షవర్ధన్ - ఆరోగ్యశాఖమంత్రి 13.అరుణ్ జైట్లీ - ఆర్థికశాఖమంత్రి 14. నితిన్ గడ్కరీ - రైల్వేశాఖ 15. రవి శంకర్ ప్రసాద్ 17. అరుణ్ శౌరీ 18. పియూష్ గోయల్