రాష్ట్రపతికి కొత్త మంత్రుల జాబితా
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే మంత్రుల జాబితాను నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. 35మందితో మోడీ మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీరిలో 17మంది కేబినెట్, 18 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా చిన్న కేబినెట్‌తో ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ ఈరోజు ఉదయం టీం సభ్యులతో గుజరాత్ భవన్‌లో భేటీ అయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజులకు చోటు దక్కనుంది. కాగా మంత్రివర్గంలో చోటు దక్కిన వారికి రాష్ట్రపతి భవన్ అధికారులు సమాచారం అందిస్తున్నారు.
మోడీతోపాటు 18 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
1. నిర్మలా సీతారామన్
2. సుష్మాస్వరాజ్ - విదేశీ వ్యవహారాలు
3. రవిశంకర్ ప్రసాద్ -సమమాచారశాఖ మంత్రి
4.రాజ్ నాధ్ సింగ్- హోంమంత్రి
5. ధర్మేంధ్ర ప్రధాన్
6.గోపినాధ్ ముండే
7.రాం విలాస్ పాశ్వాన్
8. అనంత్ కుమార్
9. నజ్మా హెప్తుల్లా
10.ఉమాభారతి,
11.వి.కె.సింగ్
12.హర్షవర్ధన్ - ఆరోగ్యశాఖమంత్రి
13.అరుణ్ జైట్లీ - ఆర్థికశాఖమంత్రి
14. నితిన్ గడ్కరీ - రైల్వేశాఖ
15. రవి శంకర్ ప్రసాద్
17. అరుణ్ శౌరీ
18. పియూష్ గోయల్