భారత ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీని పలువురు సీనియర్ నేతలు సోమవారం ఉదయం గుజరాత్ భవన్లో కలిశారు.
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీని పలువురు సీనియర్ నేతలు సోమవారం ఉదయం గుజరాత్ భవన్లో కలిశారు. ఈ సందర్భంగా గుజరాత్ భవన్ నేతలతో సందడిగా మారింది. వెంకయ్యనాయుడు, మేనకా గాంధీ, నితిన్ గడ్కరి, ప్రకాష్ జవదేకర్, హర్షవర్థన్, సుష్మా స్వరాజ్, రాధా మోహన్ సింగ్, నిర్మలా సీతారామన్, వీకే సింగ్, రామ్విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వా, అనంత కుమార్ తదితర నేతలకు మోడీ ఫోన్ చేశారు. దాంతో వీరంతా గుజరాత్ భవన్ చేరుకున్నారు. వీరందరికీ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.