75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లో నో ఛాన్స్?
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సీనియర్లకు మొండి చెయ్యి చూపే అవకాశాలు కనిపిస్తోంది. 75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లోకి నో ఎంట్రీగా కనిపిస్తోంది. దాంతో పార్టీ సీనియర్ నేతలు ఎల్కె అద్వానీ (86), మురళీ మనోహర్ జోషీ(80)లకు చోటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్లు అయిన వీరికి కేవలం పార్టీ పర్యవేక్షక బాధ్యతలు మాత్రమే అప్పగించనున్నట్లు సమాచారం.
ఇక నరేంద్ర మోడీతో పాటు 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త టీమ్ సభ్యులకు మోడీ ఈరోజు ఉదయం గుజరాత్ భవన్లో తేనీటి విందు ఇచ్చారు. అలాగే పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అవుతున్నారు. అంతకు ముందు నరేంద్ర మోడీ మాజీ ప్రధాని వాజ్పాయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.