Syed Modi Grand Prix
-
ఫైనల్లో సింధు, సాయిప్రణీత్
లక్నో: సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ సంచలన విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ ఆటగాడు, ఈ టోర్నీలో మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ పూసర్ల వెంకట సింధు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఒలింపిక్ రజత పతక విజేత సింధు 21–11, 21–19తో నాలుగో సీడ్ ఫిత్రియాని ఫిత్రియాని (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఈ హైదరాబాదీ స్టార్ ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సాయిప్రణీత్ 15–21, 21–10, 21–17తో శ్రీకాంత్‌ను కంగుతినిపించాడు. టైటిల్ పోరులో సాయిప్రణీత్ భారత్‌కే చెందిన సమీర్ వర్మతో తలపడతాడు. సెమీస్‌లో సమీర్ 21–15, 21–11తో హర్షిల్ డానీపై గెలిచాడు. మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి తుదిపోరుకు సిద్ధమైంది. మహిళల ఈవెంట్లో ఆమె అశ్విని పొన్నప్పతో కలిసి 18–21, 21–12, 21–13తో సంజన–ఆరతి సారా జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రాతో జతకట్టిన ఆమె 21–18, 21–13తో క్రిస్టియన్‌సేన్–సార తైగెసన్ (డెన్మార్క్) జంటపై నెగ్గింది. ఫైనల్లో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీతో సిక్కి–ప్రణవ్ ద్వయం తలపడుతుంది. -
సయ్యద్ మోదీ టోర్నీకి సైనా దూరం
లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ నుంచి డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వైదొలిగింది. కాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేని కారణంగా సయ్యద్ మోదీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సైనా తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఈవెంట్ నిర్వహకులకు లేఖ రూపంలో తాను వైదులుగుతున్నట్లు వెల్లడించింది. గత కొన్ని రోజుల నుంచి తన కాలి గాయం బాధిస్తుందని, ఇంకా ఆ గాయం పూర్తిగా నయం కాలేనందున టోర్నీకి దూరం అవుతున్నట్లు తెలిపింది. మంగళవారం(జనవరి 26) నుంచి సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి టోర్నమెంట్ ఆరంభం కానున్న నేపథ్యంలో సైనా తన నిర్ణయాన్ని చివరి నిమిషంలో నిర్వాహకులకు తెలియజేసింది. గతేడాది చైనా ఓపెన్ ఫైనల్స్ లో గాయంతో బాధపడిన సైనా.. ఆ తరువాత జరిగిన హాంకాంగ్ ఓపెన్ కు దూరమయ్యింది. కాగా, డిసెంబర్ లో జరిగిన బీడబ్యూఎఫ్ సూపర్ సిరీస్ కు గాయం పూర్తిగా తగ్గకుండానే సైనా సన్నద్ధమయ్యింది. దీంతో ఆ గాయం మరోసారి తిరగబెట్టడంతో గత కొంతకాలంగా సైనా విశ్రాంతి తీసుకుంటుంది. -
ప్రధాన డ్రాకు 12 మంది అర్హత
సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి టోర్నీ లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు చెందిన 12 మంది షట్లర్లు ప్రధాన డ్రాకు అర్హత సాధించారు. గోమతి నగర్‌లోని బీబీడీ యూపీ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో పురుషుల సింగిల్స్‌లో సతీందర్ మాలిక్, లవ్ కుమార్, విక్రాంత్ కుమార్ కోరుకొండ, సిద్ధార్థ్, హిమాన్షు, తలార్ లా, అంకిత్, రజత్‌లు; మహిళల సింగిల్స్‌లో ఎక్తా, రియా, లలిత, యామినిలు అర్హత పొందారు. టాప్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు బుధవారం జరిగే తొలి రౌండ్లో యిన్ ఫిన్ లుమ్ (మలేసియా), ఎక్తా కాలియా (భారత్)తో తలపడతారు. కశ్యప్... శుభాంకర్ డేతో; శ్రీకాంత్... శ్రేయాన్ష్ జైస్వాల్‌తో పోటీ పడతారు.