ప్రధాన డ్రాకు 12 మంది అర్హత | 12 members were eligible for draw | Sakshi
Sakshi News home page

ప్రధాన డ్రాకు 12 మంది అర్హత

Published Wed, Jan 21 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

12 members were eligible for draw

సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి టోర్నీ
 
 లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు చెందిన 12 మంది షట్లర్లు ప్రధాన డ్రాకు అర్హత సాధించారు. గోమతి నగర్‌లోని బీబీడీ యూపీ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో పురుషుల సింగిల్స్‌లో సతీందర్ మాలిక్, లవ్ కుమార్, విక్రాంత్ కుమార్ కోరుకొండ, సిద్ధార్థ్, హిమాన్షు, తలార్ లా, అంకిత్, రజత్‌లు; మహిళల సింగిల్స్‌లో ఎక్తా, రియా, లలిత, యామినిలు అర్హత పొందారు. టాప్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు బుధవారం జరిగే తొలి రౌండ్‌లో యిన్ ఫిన్ లుమ్ (మలేసియా), ఎక్తా కాలియా (భారత్)తో తలపడతారు. కశ్యప్... శుభాంకర్ డేతో; శ్రీకాంత్... శ్రేయాన్ష్ జైస్వాల్‌తో పోటీ పడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement