మెయిన్ ‘డ్రా'కు జయరామ్ | Jayaram for moin draw | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా'కు జయరామ్

Published Wed, Nov 19 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

మెయిన్ ‘డ్రా'కు జయరామ్

మెయిన్ ‘డ్రా'కు జయరామ్

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ

కౌలూన్ (హాంకాంగ్): హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత యువతార అజయ్ జయరామ్ మెయిన్ ‘డ్రా'కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో జయరామ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. తొలి రౌండ్‌లో  21-12, 22-20తో లతీఫ్ (మలేసియా)పై, రెండో రౌండ్‌లో 23-21, 21-7తో  చున్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు.

బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)తో అజయ్ జయరామ్; చెన్ చౌ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సెన్సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; షో ససాకి (జపాన్)తో గురుసాయిదత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఒంగ్‌బుమ్‌రుంగ్‌పన్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు; జామీ సుబంధి (అమెరికా)తో సైనా నెహ్వాల్ ఆడతారు.

 సైనా, శ్రీకాంత్‌లకు ప్రణబ్ అభినందనలు
 చైనా ఓపెన్‌లో టైటిల్స్ సాధించిన సైనా నెహ్వాల్, శ్రీకాంత్‌లను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. వారిద్దరికీ వ్యక్తిగత సందేశాలు పంపించారు. అలాగే కేంద్ర క్రీడాశాఖ మంత్రి సోనోవాల్ కూడా ఇద్దరినీ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement