the main draw
-
ప్రధాన డ్రాకు 12 మంది అర్హత
సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి టోర్నీ లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు చెందిన 12 మంది షట్లర్లు ప్రధాన డ్రాకు అర్హత సాధించారు. గోమతి నగర్‌లోని బీబీడీ యూపీ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో పురుషుల సింగిల్స్‌లో సతీందర్ మాలిక్, లవ్ కుమార్, విక్రాంత్ కుమార్ కోరుకొండ, సిద్ధార్థ్, హిమాన్షు, తలార్ లా, అంకిత్, రజత్‌లు; మహిళల సింగిల్స్‌లో ఎక్తా, రియా, లలిత, యామినిలు అర్హత పొందారు. టాప్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు బుధవారం జరిగే తొలి రౌండ్లో యిన్ ఫిన్ లుమ్ (మలేసియా), ఎక్తా కాలియా (భారత్)తో తలపడతారు. కశ్యప్... శుభాంకర్ డేతో; శ్రీకాంత్... శ్రేయాన్ష్ జైస్వాల్‌తో పోటీ పడతారు. -
మెయిన్ ‘డ్రా'కు జయరామ్
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ కౌలూన్ (హాంకాంగ్): హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత యువతార అజయ్ జయరామ్ మెయిన్ ‘డ్రా'కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో జయరామ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. తొలి రౌండ్లో 21-12, 22-20తో లతీఫ్ (మలేసియా)పై, రెండో రౌండ్లో 23-21, 21-7తో చున్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)తో అజయ్ జయరామ్; చెన్ చౌ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; షో ససాకి (జపాన్)తో గురుసాయిదత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒంగ్‌బుమ్‌రుంగ్‌పన్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు; జామీ సుబంధి (అమెరికా)తో సైనా నెహ్వాల్ ఆడతారు. సైనా, శ్రీకాంత్‌లకు ప్రణబ్ అభినందనలు చైనా ఓపెన్‌లో టైటిల్స్ సాధించిన సైనా నెహ్వాల్, శ్రీకాంత్‌లను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. వారిద్దరికీ వ్యక్తిగత సందేశాలు పంపించారు. అలాగే కేంద్ర క్రీడాశాఖ మంత్రి సోనోవాల్ కూడా ఇద్దరినీ ప్రశంసించారు.