Syria border
-
ఇరాక్‌లో అమెరికా దాడులు
బాగ్దాద్: ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల వర్గంపై అమెరికా ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. సిరియా సరిహద్దుల్లోని అల్ ఖయిమ్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా బ్రిగేడ్స్‌కు చెందిన పలు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది చనిపోయారు. 51 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురు కమాండర్లు కూడా ఉన్నారు. ఇరాన్ అనుకూల హషెద్ అల్ షాబి సంస్థ విభాగమే హెజ్బొల్లా బ్రిగేడ్స్. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని మండిపడింది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్బాస్ మౌసవి హెచ్చరించారు. ఇరాక్‌లోని 3, సిరియాలోని 2 స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు విజయవంతమయ్యాయని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ చెప్పారు. -
రష్యన్ విమానం కూల్చివేత
-
రష్యన్ విమానం కూల్చివేత
అంకారా: టర్కీ సేనలు మంగళవారం సిరియా సరిహద్దులో ఓ సైనిక విమానాన్ని కూల్చివేశాయి. అది తమ దేశానికి చెందిన ఎస్యు-24 రకం యుద్ధ విమానమని రష్యా ఆ తర్వాత ప్రకటించింది. తొలుత అది ఏ దేశానికి చెందిన విమానమో తెలియరాలేదు. తర్వాత కొద్ది సేపటికి రష్యా.. ఆ విమానం తమదేనని తెలిపింది. యుద్ధ విమానం పైలట్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదని రష్యన్ అధికారిక వార్తాసంస్థ తొలుత తెలిపింది. అయితే, ఇద్దరు పైలట్లూ విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ల సాయంతో దూకేశారని, వాళ్లలో ఒకరిని సిరియన్ తిరుగుబాటుదారులు పట్టుకున్నారని తెలుస్తోంది. విమానం కూల్చివేత విషయాన్ని టర్కీ మీడియా వర్గాలు వెల్లడించాయి. అనుమతి లేకుండా సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపానికి రాగానే ఈ విమానాన్ని కూల్చి వేసినట్లు, ఆ సమయంలో దాని నుంచి ఓ ఫైర్ బాల్ కూడా పర్వతంపై పడినట్లు టర్కీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై రష్యా గుర్రుగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని రష్యా హెచ్చరించింది.