రష్యన్ విమానం కూల్చివేత | Turkey shoots down military plane on Syria border: media | Sakshi
Sakshi News home page

రష్యన్ విమానం కూల్చివేత

Published Tue, Nov 24 2015 2:09 PM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

రష్యన్ విమానం కూల్చివేత

రష్యన్ విమానం కూల్చివేత

అంకారా: టర్కీ సేనలు మంగళవారం సిరియా సరిహద్దులో ఓ సైనిక విమానాన్ని కూల్చివేశాయి. అది తమ దేశానికి చెందిన ఎస్‌యు-24 రకం యుద్ధ విమానమని రష్యా ఆ తర్వాత ప్రకటించింది. తొలుత అది ఏ దేశానికి చెందిన విమానమో తెలియరాలేదు. తర్వాత కొద్ది సేపటికి రష్యా.. ఆ విమానం తమదేనని తెలిపింది. యుద్ధ విమానం పైలట్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదని రష్యన్ అధికారిక వార్తాసంస్థ తొలుత తెలిపింది. అయితే, ఇద్దరు పైలట్లూ విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ల సాయంతో దూకేశారని, వాళ్లలో ఒకరిని సిరియన్ తిరుగుబాటుదారులు పట్టుకున్నారని తెలుస్తోంది.

విమానం కూల్చివేత విషయాన్ని టర్కీ మీడియా వర్గాలు వెల్లడించాయి. అనుమతి లేకుండా సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపానికి రాగానే ఈ విమానాన్ని కూల్చి వేసినట్లు, ఆ సమయంలో దాని నుంచి ఓ ఫైర్ బాల్ కూడా పర్వతంపై పడినట్లు టర్కీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై రష్యా గుర్రుగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని రష్యా హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement