T congress party
-
‘జోడో ’ఎంట్రీలో ఏం జరిగింది..షేక్ హ్యాండ్స్ ఎందుకు మిస్సయ్యాయి?
రాహుల్ జోడో యాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ చాలా ఏర్పాట్లే చేసింది. అయితే ఎంట్రీ రోజే పీసీసీ చేతులెత్తేసిందంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. జోడో యాత్ర ఎంట్రీలో అనుకున్నదొకటి అయితే.. అయింది మరొకటని చెబుతున్నారు. పక్కా ప్లాన్.. అట్టర్ ఫ్లాప్ ఈ నెల 23వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ ఎంట్రీకి చాలా రోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేసింది టీ పీసీసీ నాయకత్వం. యాత్ర సక్సెస్ చేయడానికి 13 రకాల కమిటీలను వేసింది. యాత్ర కర్ణాటక నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో రాహుల్ ను ఆహ్వానించేందుకు 41మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీ వేసింది. కానీ జోడో యాత్ర రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రోజు ఒకటి అనుకుంటే మరోకటి జరిగిందని చర్చించుకుంటున్నారు టీ కాంగ్రెస్ నాయకులు. షేక్ హ్యాండ్స్ ఎందుకు మిస్సయ్యాయి? భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించాక రిసెప్షన్ కమిటీలోని 41 మంది సభ్యులు రాహుల్ ను ఆహ్వానించాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఠాగూర్ లేదా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాని నేతలందరిని రాహుల్‌కు పరిచయం చేయాల్సి ఉంది. కానీ ఇదేమీ జరగకుండానే జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి జాతీయ జెండాను ఇవ్వడం ఒక్కటే పద్దతి ప్రకారం జరిగింది. మిగిలిన కార్యక్రమం ఏదీ అనుకున్నట్లుగా జరగలేదు. దీంతో రిసెప్షన్ కమిటీ సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తొక్కిసలాట? ఇక రాహుల్ యాత్ర రాష్ట్రంలో ప్రవేశించిన సందర్భంగా రాహుల్‌ను చూసేందుకు, కలిసేందుకు వేల మంది కార్యకర్తలు సరిహద్దు ప్రాంతానికి వచ్చారు. కార్యకర్తల మధ్య కొందరు సీనియర్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సమాచారం. తొక్కిసలాటలో కిందపడి కొందరికైతే తీవ్ర గాయాలయ్యాయి. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రలో కిందపడిపోయారు. పొన్నాల చేయికి గాయం అయింది. ఇక ఉత్తమ్ కుమార్ కింద పడిపోగా అక్కడే ఉన్న పొలీసు అధికారి సేవ్ చేసినట్లు తెలుస్తోంది. లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తీవ్రంగా గాయాలు అయ్యేవట. మరో నేత బలరాం నాయక్ సైతం కింద పడిపోయారట. ఇలా చాలా మంది నేతలు కార్యకర్తల నడుమ తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో చాలా మంది నేతలు యాత్రకు దూరంగా ఉంటేనే మంచిదని, వీలైతే మధ్యాహ్నం బ్రేక్ టైంలో రాహుల్ ను కలిస్తే బెటర్ అనుకుంటున్నారట కొందరు నేతలు. -
తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ లక్ష్యం.. 35 లక్షలు
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ కేడర్, నాయకులు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలోని 35 లక్షల మందిని కాంగ్రెస్‌లో సభ్యులుగా చేర్పించాలి. ఈసారి మన బ్యాలెట్ బాక్సుల్లో 80 లక్షల ఓట్లు పడాలి. అప్పుడే మనం నిర్దేశించుకున్న 78 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఆ దిశలో పార్టీ కేడర్ ముందుకెళ్లాలి’అని ఆయన కోరారు. కాంగ్రెస్ రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరంలో భాగంగా మొదటిరోజు మంగళవారం కొంపల్లిలోని ఒయాసిస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని కోరారు. నేను గొప్ప అంటే నేనే గొప్ప అంటూ గొడవలు పెట్టుకోవద్దని, కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. నియోజకవర్గ ఇన్ చార్జీలను కొనసాగించబోమని.. బ్లాక్, మండల, నగర, పట్టణ, జిల్లా అధ్యక్షులే కలిసికట్టుగా పార్టీని నడిపిస్తారని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల కష్టం వల్లే నాయకులుగా తాము పదవులను అనుభవిస్తున్నామని, కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ గీత దాటితే సహించేది లేదని హెచ్చరించారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, పనిచేయని వారికి ఉద్వాసన తప్పదని అన్నారు. జనవరి 26 తర్వాత ఈ చర్యలు తీసుకోవడం మొదలుపెడతానని చెప్పారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన వారు చచ్చినవారితో సమానమని, కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుం టానని వెల్లడించారు. పేర్లు మార్చారని ఆందోళన: కాంగ్రెస్ సదస్సుకు జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి బ్లాక్, మండల అధ్యక్షులతో హాజరయ్యారు. అయితే.. అప్పటికే రాత్రికి రాత్రే బ్లాక్, మండల కమిటీలో పేర్లు వచ్చినవారు సదస్సుకు వచ్చా రు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాఘవరెడ్డి.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను నిలదీయడమే గాక ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసు కోవడం గమనార్హం. అయితే.. అందరితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని రేవంత్ వారికి హామీ ఇచ్చారు. తర్వాత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై రాఘవరెడ్డి వర్గం తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్లిపోవడం కనిపించింది. శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్సే... దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చి పోతుం టాయి కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు.. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేయగల శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని భట్టి చెప్పారు. తొలిరోజు పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సహా 1,200 మందికి పైగా బ్లాక్, మండల, పట్టణ, నగర, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఘన చరిత.. కాంగ్రెస్‌దే భవిత.. తొలిరోజు శిక్షణలో భాగంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘కాంగ్రెస్ పార్టీ చరిత్ర– దేశ నిర్మాణంలో పాత్ర’అనే అంశంపై ఇచ్చిన ప్రెజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. పార్టీ ఆవిర్భావంతో పాటు స్వాతంత్య్ర పోరాటం నుంచి దేశాన్ని బలమైన ఆర్థిక, సామాజిక పునాదులపై కాంగ్రెస్ ఎలా నిలబెట్టిందనే అంశంపై ఆయన కూలంకషంగా వివరించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఘన చరిత ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్ర లేక ఇతర పార్టీల చరిత్రను తనదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. -
ఎందుకిలా జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆ పార్టీ అధిష్టానం పట్టించుకుంటోందా? గత 4–5 నెలలుగా ఒక్కొక్కరుగా చేజారుతున్న ఎమ్మెల్యేల్లో కనీసం ఎవరినైనా పిలిపించి మాట్లాడిందా? వారికి తామున్నామని భరోసా కల్పించే ప్రయత్నం చేసిందా? 12 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లి ఏకంగా పార్టీ శాసనసభాపక్షాన్నే విలీనం చేసినా రాష్ట్ర నాయకత్వానికి ధీమా వచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అంటే లేదనే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. కారణమేదైనా తెలంగాణ కాంగ్రెస్‌ను హైకమాండ్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హైకమాండ్ వ్యవహార శైలినిబట్టి చూస్తే రాజకీయంగా ఎన్నో ఆశలతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా రెండుసార్లు ఘోర పరాభవాన్ని రుచి చూపించిన రాష్ట్రం విషయంలో చేతులెత్తేసిందా అనే అనుమానం పార్టీ నేతల్లో కలుగుతోంది. నేతల్లో భరోసా కల్పించకపోవడం వల్లే... పార్టీపై భరోసా లేకుండా పోతోందని టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెబుతుంటే మరి భరోసా లేనప్పుడు పార్టీ టికెట్ ఎలా తీసుకున్నారని ప్రశ్నించడమే తప్ప పార్టీలో వారికి అవసరమైన భరోసాను కల్పించడంలో కూడా టీపీసీసీ నాయకత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక నేతల పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీ పెద్దలు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడంతో పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో సమావేశమై అందరిలో భరోసా కల్పిస్తారని చెప్పినా అది జరగలేదు. హైకమాండ్ దృష్టికి వెళ్తున్నాయా..? పార్టీ రాష్ట్రశాఖలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్ దృష్టికి వెళ్లడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేల విషయాన్ని ఆదిలోనే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకమాండ్‌తో రాష్ట్ర పార్టీని సమన్వయం చేయడంలో అధిష్టానంపక్షాన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ఆర్.సి.కుంతియా విఫలమయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైన ఆయన ఎప్పటికప్పుడు హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లకుండా వ్యవహారాలను నాన్చుతున్నారని అంటున్నారు. ప్రతి విషయంలోనూ ఇదే ధోరణితో ఆయన మొదటి నుంచీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర పార్టీ విషయంలో హైకమాండ్‌ను ప్రభావితం చేసే స్థాయిలో సమన్వయం చేయడం లేదనే విమర్శలు కుంతియాపై వస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్లో ఆయన చొరవ తీసుకోకపోవడం, హైకమాండ్‌కు సకాలంలో చెప్పకపోవడం, టీపీసీసీ నాయకత్వానికి మార్గదర్శనం చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు. ముందే మేలుకొని ఉంటే... వాస్తవానికి ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోశ్, ప్రభాకర్ కాంగ్రెస్ శాసనమండలిపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చిన రోజే టీపీసీసీ నాయకత్వం, ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. ఒక జాతీయ పార్టీ తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు పార్టీ అనుమతి లేకుండా సమావేశం కావడం, సీఎల్పీ పేరుతో తీర్మానాలు చేయడం సాంకేతికంగా చెల్లవనే వాదనను బలంగా తీసుకెళ్లడంలో విఫలం కావడం, ఈ ప్రయత్నాన్ని ఎదుర్కొనే క్రమంలో కనీస పట్టుదల లోపించడంతో ఇప్పుడు అసెంబ్లీలో వెనుక బెంచీల్లో కూర్చోవాల్సి వస్తోందని పార్టీ నేతలు వాపోతున్నారు. మండలి సభ్యులు చేసిన తీర్మానంపై పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం ఈ పరిణామాన్ని ఢిల్లీ వరకు తమ పార్టీ నేతలు తీసుకెళ్లారో కూడా అర్థం కాలేదని, అదే జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీలో ఏం జరిగినా హైకమాండ్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. ఇప్పుడు పార్టీ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మరో పార్టీలోకి వెళ్లినా కనీసం పట్టించుకోలేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమేనని, హైకమాండ్ వెంటనే తాజా పరిణామాలపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్‌లోకి మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్ : సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పలుమార్లు అసెంబ్లీ బరిలో దిగిన టీడీపీ మాజీ నేత జగదీశ్వర్‌రావు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామాలతో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల నుంచే... గత ఆరు నెలలుగా నాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. నెల క్రితం ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో దామోదర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేద్దామని, అధికార టీఆర్ఎస్ను ఓడించేందుకు కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావడం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పుకొచ్చినా దామోదర్‌రెడ్డి స్వాగతించలేదు. ఇకఆ తర్వాత నాగం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఇక నాగం జనార్దన్‌రెడ్డి చేరికను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయిన డీకే.అరుణ, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య తదితరులు వ్యతిరేకించడంతోపాటు రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిపి ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని వాదన వినిపించారు. ఉమ్మడి జిల్లాలోని డీకే.అరుణ వర్గీయులందరూ సమావేశమై నాగం, జగదీశ్వర్‌రావుకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. ఈ తరుణంలో నాగం, జగదీశ్వర్రావుల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో కందనూలు కాంగ్రెస్ పార్టీలోని ఇరు నియోజకవర్గాల్లో వర్గ పోరు మొదలైనట్లయింది. భారీ సభకు ఏర్పాట్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం జనార్దన్‌రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాగర్‌కర్నూల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి నేతలందరినీ ఇక్కడకు రప్పించి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సమర శంఖారావం పూరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని నాగం అనుచరులు చెబుతున్నారు. మరోపక్క తమ మద్దతుదారులతో నాగర్‌కర్నూల్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు నాగం సమాయత్తమవుతున్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితోపాటు నియోజకవర్గంలోని మిగతా కీలక నేతలందరినీ కలుపుకుపోయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకునేందుకు నాగం బల ప్రదర్శన చేయనునున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాగం పార్టీలో చేరడంతో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. -
'ఆ రెండింటిలోనూ మాదే గెలుపు'
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాదు నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలోనూ గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జూపల్లి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనైతిక పొత్తులు పెట్టుకుందని ఆరోపించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ టీడీపీ, బీజేపీతో కూడా కుమ్మక్కైందని విమర్శించారు. భవిష్యత్‌లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతాయని జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
ప్రేముంటే బాలకృష్ణకు మంత్రిపదవి ఇవ్వాలి
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రేమ ఉంటే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని టి. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతిలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.... ఎన్టీఆర్ పుట్టి పెరిగిన కృష్ణాజిల్లా బందరు మండలం నిమ్మకూరు గ్రామానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అంతేకాని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.