ప్రేముంటే బాలకృష్ణకు మంత్రిపదవి ఇవ్వాలి
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రేమ ఉంటే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని టి. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతిలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ....
ఎన్టీఆర్ పుట్టి పెరిగిన కృష్ణాజిల్లా బందరు మండలం నిమ్మకూరు గ్రామానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అంతేకాని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.