5న ధర్నా అనగానే 4న ప్రకటనా ? | Perni Nani takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

5న ధర్నా అనగానే 4న ప్రకటనా ?

Published Wed, Dec 3 2014 1:49 PM | Last Updated on Tue, Sep 3 2019 8:50 PM

5న ధర్నా అనగానే 4న ప్రకటనా ? - Sakshi

5న ధర్నా అనగానే 4న ప్రకటనా ?

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా రుణమాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.... ఈ నెల తమ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా అని ప్రకటించగానే... 4వ తేదీనే రుణమాఫీపై ప్రకటన అంటూ చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అన్నయ్యగా ప్రతిపైసా తానే కడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పుడు ఎందుకిలా మోసం చేస్తున్నారంటూ చంద్రబాబును పేర్నినాని సూటిగా ప్రశ్నించారు.

రోజుకోమాట, పూటకో ప్రకటనతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేలా కృషి చేస్తుందని చెప్పారు. 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉండి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నైజం ఇప్పటికీ మారలేదని ప్రజలు గుర్తించారని పేర్ని నాని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement