T congress party leader
-
'వైఎస్ఆర్ సహకారంతో హైదరాబాద్ అభివృద్ధి చేశాం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీనే కానీ... మాటల పార్టీ కాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎస్ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.... తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు రూ. 4 వేల కోట్లను వివిధ పథకాల కింద మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఆ నిధులతో అప్పటి ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. పేదలకు 76 వేల ఇళ్లు నిర్మించి ఇచ్చామని.... కృష్ణా జలాలు భాగ్యనగరానికి రప్పించేందుకు రూ. 600 కోట్లు ఇచ్చామని ఆయన వివరించారు. ఆర్టీసీ ద్వారా నగరానికి 1400 బస్సులు కూడా ఇచ్చామని చెప్పారు. తమ పార్టీ అభివృద్ధి చేయడమే తప్పా... చిల్లర ప్రచారం చేసుకనే అలవాటు లేదని ఎస్ జైపాల్‌రెడ్డి ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చురక అంటించారు. అల్లరి చేసే కంటే ప్రజలకు పనులు చేయడంపైనే శ్రద్ధ చూపాలని ఈతరం నేతలకు ఎస్. జైపాల్‌రెడ్డి హితవు పలికారు. -
మళ్లీ దూకేశాడుగా...
స్కూల్ పిల్లగాడు తొక్కుడు బిళ్ల ఆటలో ఆ గడి నుంచి ఈ గడికి దూకినంత ఈజీగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి పార్టీలు మారుతున్నారు. తొలుత బీజేపీలో చేరిన ఆయన... ఆ తర్వాత టీఆర్ఎస్ కారు ఎక్కారు. అదీ నచ్చక కాంగ్రెస్‌లో చేరి ఆ నేతలతో చెట్టాపట్టాలేసుకుని... ప్రభుత్వ విప్ పదవి పొందారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నప్పుడు కూడా తనది జంపింగ్ రాగమే కాదు సమైక్య రాగం కూడా అంటూ కోరస్ లేకుండా సాంగేసుకుని మరీ జయప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. మళ్లీ సంగారెడ్డి నుంచి హస్తం పార్టీ తరపున పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ ఏదో సభకు వెళ్లి అధ్యక్షా అననిదే మనస్సు మనస్సులో నిలిచేలా లేదు. దాంతో మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలు వస్తున్నాయని తెలిసి హస్తం పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అధిష్టానం మాత్రం మీరు క్యూలో ఉన్నారు అని చెప్పడంతో.. టికెట్ వస్తుందో రాదో అని అనుకుంటున్నారు. ఆ తరుణంలో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ... అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ టిక్కెట్ కోసం బీ ఫారం అడిగితే డీసీసీ పీఠం ఎవడికీ కావాలని అంటూ మీకు మీ పార్టీకో దణ్ణం అంటూ కాంగ్రెస్‌కి రాం రాం చెప్పారు. ఆ సమయంలోనే ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని తెలిసి... ఆ నాయకులను కలిశారు. అదీకాక ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే తన 'సమైక్య రాగం' సెంటిమెంట్ తనకు ఆయింట్మెంట్లా పనికొస్తుందని భావించారు. ఎలాగోలా టీడీపీ పొత్తుతో బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఉప ఎన్నికల్లో కారు దెబ్బకు కమలం మూడో స్థానంలోకి చేరింది. కాంగ్రెస్‌లోనే ఉంటే పార్టీ విజయం సాధించి ఉండేదేమో అనే జయప్రకాశ్ రెడ్డి మీమాంసలో పడ్డారు. నాటి నుంచి మనశాంతి కరువైంది. కాంగ్రెస్‌లో ఉన్న మనశాంతి నేడు లేదని భావించిన ఆయన హస్తంలో చేరేందుకు ఆ పార్టీ నేతల చుట్టు ప్రదక్షణాలు చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ అధిష్టానం పెద్దలను కూడా కలసి తన పరిస్థితి వివరించారు. మెదక్ అంటేనే కేసీఆర్... కేసీఆర్ అంటేనే మెదక్ అనే రేంజ్లో ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈ తరుణంలో టీఆర్ఎస్పై విమర్శలు చేసే తెలంగాణలో పెద్ద తలకాయిగా ఉన్న డీఎస్ కూడా కారు ఎక్కేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి కూడా టీఆర్ఎస్ నేతలను విమర్శించాలంటే పద్దతిగా మాట్లాడతారు. దాంతో టీ కాంగ్రెస్‌కు 'నోరున్న' నేత కోసం ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారు. దాంతో తూర్పు జయప్రకాశ్‌రెడ్డి నోరున్న నేత కావడంతో సదరు నేతలు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే హస్తం పార్టీ పెద్దల సమక్షంలో వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ వీడటమే తాన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఈ సందర్భంగా చెప్పిన జయప్రకాశ్‌రెడ్డి మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉంటారా ? ఏమో... . -
గెలిచే దమ్ము లేక...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ... గెలిచే దమ్ము లేక ఒక్క సనత్‌నగర్‌లో 54 శాతం ఓట్లు తొలగించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నిక సంఘం దృష్టికి తీసుకువెళ్తానని మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కుట్రపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ టీఆర్ఎస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని శశిధర్ రెడ్డి విమర్శించారు. సనత్ నగర్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఈ విషయంలో కూడా గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ సభ్యుడిలా మాట్లాడుతున్నారన్నారు. -
పార్టీలోనే ఉంటాను కానీ పోటీ చేయను!
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఉప ఎన్నికను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. అందులోభాగంగా పార్టీ సీనియర్లు పలువురు నేతలను సంప్రదిస్తున్నారు. అ క్రమంలో ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ జి. వివేక్‌ను సంప్రదించారు. అయితే పార్టీలోనే ఉంటాను కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ కేంద్ర మంత్రి ఎస్ రాజయ్యను ఈ ఉప ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ నేతలు యోచనలో ఉన్నట్లు తెలిసింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కడియం శ్రీహరిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దాంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలనే కాదు వరంగల్ లోక్‌సభను కూడా కైవసం చేసుకుంటామనే ధీమాతో కేసీఆర్ సర్కార్ ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన జి.వివేక్... టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
'సుష్మను డమ్మీ... అద్వానీని మమ్మీ చేశారు'
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఆ పార్టీలో కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోదీ అసాధ్యమైన వాగ్దానాలు చేసి... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని జైపాల్ రెడ్డి విమర్శించారు. అసాధ్య హామీలను నెరవేర్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ విఫలమయ్యారన్నారు. అబద్ధాలు చెప్పడంలో వారికి వారే సాటి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మొదటి నుంచి బీజేపీతో జత కట్టాలనుకున్నారని జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాశ్మీర్ టెర్రరిస్టుల సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి దేశ భక్తి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు. పాకిస్థాన్ విషయంలో మోదీ ఎన్నికల ముందు ప్రదర్శించిన దేశభక్తి ఇప్పుడు చూపడంలేదని జైపాల్‌రెడ్డి విమర్శించారు.