T-fiber net
-
హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ వృద్ధికి ఓపెన్ డేటా సెంటర్లు బూస్టప్ ఇస్తున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,423 డేటా సెంటర్లుండగా నగరంలో సుమారు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్క్ అభివృద్ధితోపాటు వివిధ రకాల సేవల అనుసంధానం, డిజిటల్, సాఫ్ట్‌నెట్ సేవలను అందించేందుకు ఈ కేంద్రాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ రంగానికి కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్ సిటీలో టీఎస్ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్ తదితర సంస్థల ద్వారా స్టార్టప్‌లను ఇతోధికంగా ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లిభించడంతో డిజిటల్ సేవలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 17,328 కి.మీ. మార్గంలో కేబుల్ లైన్ ఏర్పాటైనట్లు తెలిపారు. మరో ఐదు వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నలుచెరుగులా విస్తరణకు చర్యలు.. నగరం నలుచెరుగులా ఐటీ వృద్ధికి ఐటీ శాఖ చర్యలు ప్రారంభించింది. తాజాగా కండ్లకోయ గేట్‌వే ఐటీ పార్క్ విస్తీర్ణాన్ని 6 లక్షల చదరపు అడుగుల నుంచి 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచింది. త్వరలో ఈ పార్క్ నిర్మాణం మొదలు కానుంది. కాగా ఈ పార్క్‌కు సమీపంలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. నగరంలో నలు చెరుగులా టెకీలు ఐటీ ఉ ద్యోగాలు చేసేలా నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు ఐటీ శాఖ చర్యలు చేపట్టడం విశేషం. టాప్ కంపెనీలకు చిరునామా.. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 7.78 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే.(క్లిక్: కొత్త స్మార్ట్ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?) ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ బూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఏటా రూ. 1.83 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటతాయని ఐటీ వర్గాలు అంచనా వేస్తుండడం విశేషం. (క్లిక్: హైదరాబాద్ పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే..) -
‘టి ఫైబర్’తో రైతు వేదికలకు ఇంటర్నెట్..
సాక్షి, హైదరాబాద్: టి ఫైబర్‌పై ఐటీ మంత్రి కేటీఆర్ పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టి ఫైబర్’ప్రాజెక్టు ద్వారా రైతు వేదికలను ఇంటర్నెట్తో అనుసంధానించి ప్రతి రైతుకూ మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ఐదు రైతు వేదికలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టి ఫైబర్) బోర్డు సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాలని, ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి అన్ని గ్రామపంచాయతీలను ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించాలని సూచించారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతి మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఏడాది జూన్ నుంచి ప్రాధాన్యతాక్రమంలో కనెక్షన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్, మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, టీ ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. చదవండి: 2 నెలల్లోనే తారస్థాయికి -
ఇంటింటికీ ఇంటర్నెట్
సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా టీ–ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీ–ఫైబర్ పనులు సాగుతున్నాయని, ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరి తహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటుతూ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యాయమైన వాటా వాడుకుంటున్నాం కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన నీటి వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశానికి రైతులే వెన్నెముక అని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటును అందిస్తున్నామని, పెట్టుబడి సాయం గా ఇంతటి కరోనా కష్టకాలంలో 57 లక్షల మంది రైతులకు రూ. 7,200 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు బీమా కల్పించి ధీమా ఇస్తున్నామని, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. దమ్మున్న, దక్షత ఉన్న, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కేసీఆర్ అని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల లాభం కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదన్నారు. అక్కరకొచ్చే పంటలు వేస్తే లాభదాయకం అవుతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారని, పంటల సాగులో మార్పు వచ్చిందన్నారు. పాలనా సౌలభ్యం కోసం.. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 30 రెవెన్యూ డివిజన్లను 73 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. 439 మండలాలు ఉండగా అదనంగా 131 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 3,400 తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఇకపై అభివృద్ధిపైనే దృష్టి వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో వీర్నపల్లి మం డలం రాశిగుట్టతండా, మద్దిమల్ల, సోమారం పేట, వన్‌పల్లి, శాంతినగర్ వద్ద నిర్మించిన ఐదు వంతెనలను మంత్రి ప్రారంభించారు. కంచర్లలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గర్జనపల్లిలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
సర్కారు కార్యాలయాలకు టీ–ఫైబర్ నెట్
- ఐటీ శాఖ సన్నాహాలు - ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం త్వరలో వర్క్‌షాప్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ (టీ–ఫైబర్) ద్వారా ఇంటర్నెట్ సదు పాయం కల్పించేందుకు ఐటీ శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఇంటర్నెట్ అవసరాలు, వినియోగం, ఇందుకు చేస్తున్న వ్యయంపై అధ్యయనం చేపట్టింది. ఈ క్రమం లో టీ–ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వ శాఖలు ఏం ఆశిస్తున్నాయి, భవిష్యత్తు సాంకే తిక అవసరాలేమిటి, కావాల్సిన బ్యాండ్ విడ్త్ ఎంత.. తదితర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ త్వరలో ప్రభుత్వ శాఖ లతో సదస్సు నిర్వహించనుంది. సమాచార సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త ట్రెండ్లు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, నమూ నాలపై ఈ సదస్సుల్లో ప్రభుత్వ శాఖలతో చర్చించనుంది. ప్రభుత్వం–ప్రభుత్వం మధ్య, ప్రభుత్వం–పౌరుల మధ్య అనుసంధానానికి బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ సేవల కోసం ప్రతి ప్రభుత్వ శాఖ ఏటా ఎంత వ్యయం చేస్తోంది, ఓ ప్రభుత్వ శాఖ పరిధిలోని అన్ని కార్యాల యాలకు నెట్వర్క్ అనుసంధానం కోసం చేస్తున్న వ్యయం ఎంత, ఇంటర్నెట్, బ్రాండ్ బాండ్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు నిర్వహి స్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకా లు ఏమిటి, ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వ శాఖ లు ఎంతమందికి, ఎన్ని గ్రామాలకు అనుసం ధానమై ఉన్నాయి.. తదితర వివరాలను ఐటీ శాఖ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించనుంది. ఇప్పటికే సిద్ధమైన డీపీఆర్ సదస్సులో వచ్చే సలహాలు, సూచనలను పరి గణనలోకి తీసుకుని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు తుది రూపు ఇస్తామని ఐటీ శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్ సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టుకు రూపకల్ప న చేయాలని నిర్ణయించడంతో ముసాయిదా డీపీఆర్‌లో మార్పులు చేసి తుదిరూపు ఇవ్వ నున్నారు. డిజిటల్ ఇండియా కింద నిధులు రాబట్టేం దుకు డీపీఆర్‌ను కేంద్ర టెలికమ్యూ నికేషన్స్ శాఖకు సమర్పిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. మిషన్ భగీరథ ప్రాజెక్టు లో భాగంగా పైపులైన్ల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పైప్లైన్లతోపాటే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు డక్ట్‌లను ప్రభుత్వం భూగర్భంలో నిర్మిస్తోంది.