- ఐటీ శాఖ సన్నాహాలు
- ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం త్వరలో వర్క్‌షాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ (టీ–ఫైబర్) ద్వారా ఇంటర్నెట్ సదు పాయం కల్పించేందుకు ఐటీ శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఇంటర్నెట్ అవసరాలు, వినియోగం, ఇందుకు చేస్తున్న వ్యయంపై అధ్యయనం చేపట్టింది. ఈ క్రమం లో టీ–ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వ శాఖలు ఏం ఆశిస్తున్నాయి, భవిష్యత్తు సాంకే తిక అవసరాలేమిటి, కావాల్సిన బ్యాండ్ విడ్త్ ఎంత.. తదితర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ త్వరలో ప్రభుత్వ శాఖ లతో సదస్సు నిర్వహించనుంది.
సమాచార సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త ట్రెండ్లు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, నమూ నాలపై ఈ సదస్సుల్లో ప్రభుత్వ శాఖలతో చర్చించనుంది. ప్రభుత్వం–ప్రభుత్వం మధ్య, ప్రభుత్వం–పౌరుల మధ్య అనుసంధానానికి బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ సేవల కోసం ప్రతి ప్రభుత్వ శాఖ ఏటా ఎంత వ్యయం చేస్తోంది, ఓ ప్రభుత్వ శాఖ పరిధిలోని అన్ని కార్యాల యాలకు నెట్‌వర్క్ అనుసంధానం కోసం చేస్తున్న వ్యయం ఎంత, ఇంటర్నెట్, బ్రాండ్ బాండ్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు నిర్వహి స్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకా లు ఏమిటి, ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వ శాఖ లు ఎంతమందికి, ఎన్ని గ్రామాలకు అనుసం ధానమై ఉన్నాయి.. తదితర వివరాలను ఐటీ శాఖ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించనుంది.
ఇప్పటికే సిద్ధమైన డీపీఆర్
సదస్సులో వచ్చే సలహాలు, సూచనలను పరి గణనలోకి తీసుకుని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు తుది రూపు ఇస్తామని ఐటీ శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్ సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టుకు రూపకల్ప న చేయాలని నిర్ణయించడంతో ముసాయిదా డీపీఆర్‌లో మార్పులు చేసి తుదిరూపు ఇవ్వ నున్నారు. డిజిటల్ ఇండియా కింద నిధులు రాబట్టేం దుకు డీపీఆర్‌ను కేంద్ర టెలికమ్యూ నికేషన్స్ శాఖకు సమర్పిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. మిషన్ భగీరథ ప్రాజెక్టు లో భాగంగా పైపులైన్ల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పైప్‌లైన్లతోపాటే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు డక్ట్‌లను ప్రభుత్వం భూగర్భంలో నిర్మిస్తోంది.
సర్కారు కార్యాలయాలకు టీ–ఫైబర్ నెట్
Published Mon, May 15 2017 2:32 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM
Advertisement